భోగాపురం బీచ్‌లో అదితి మృతదేహం: గుర్తించి కుప్పకూలిన తండ్రి
విశాఖ/విజయనగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా భోగాపురం దిబ్బలపాలెం సన్ రే తీరంలో ఆరేళ్ల బాలిక మృతదేహం గురువారం లభ్యమైంది. వారం రోజుల క్రితం విశాఖపట్నంలో గల్లంతైన బాలిక అదితి మృతదేహంగా అనుమానించి స్థానికులు సమాచారం అందించారు. తండ్రి శ్రీనివాస్ మృతదేహం తన కూతురు అదితిదేనని గుర్తించాడు. మెడలో తాయెత్తు, దిద్దులు చూసి ఆయన అదితిని గుర్తించాడు.
అదితి మృతదేహాన్ని చూసి అతను కుప్పకూలిపోయాడు. అదితి తల్లిదండ్రుల వేదన చెప్పనలవి కాకుండా ఉంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అదితి మృతి గురించి తెలియడంతో ఆమె నాయనమ్మ కుప్పకూలింది. తల్లికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో అతిథి మరణవార్తను తెలియజేయలేదు. వారిద్దరినీ ఆస్పత్రికి తరలించారు.
అంతకు ముందు స్థానికుల సమాచారంతో మృతదేహం ఎవరిదో నిర్ధారించేందుకు రెవెన్యూ, పోలీసులు అధికారులు సంఘటన స్థలానికి బయలుదేరారు. ఆ తర్వాత అదితి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి మృతదేహాన్ని గుర్తించారు.
బీచ్‌లో దొరికిన మృతదేహం అదితిగా అనుమానిస్తున్న నేపథ్యంలో విశాఖలోని అదితి తండ్రి శ్రీనివాస్, బంధువులు తదితరులు విజయనగరం బయలుదేరారు. బీచ్ వద్దకు కొట్టుకు వచ్చిన పాప మృతదేహం దుస్తులు పింక్ కలర్‌లో ఉన్నాయి.

గుర్తుపట్టలేని విధంగా ఉంది
బీచ్ వద్ద కనిపించిన మృతదేహం గుర్తు పట్టలేని విధంగా ఉందని స్థానిక పోలీసులు చెప్పిన నేపథ్యంలో, విశాఖ పోలీసులు, శ్రీనివాస్ కుటుంబ సభ్యులు లభ్యమైన మృతదేహాన్ని గుర్తించేందుకు పయనమయ్యారు.

భోగాపురం బీచ్‌లో అదితి మృతదేహం
కాగా, ఏపీలోని విశాఖలో ఆరేళ్ల బాలిక అదితి డ్రయినేజీలో ప్రమాదవశాత్తూ పడి గల్లంతై దాదాపు వారం రోజులు అవుతోంది. ఇప్పటి వరకు ఆమె ఆచూకీ లభించలేదు. ఆమె కుటుంబ సభ్యులు సామాజిక అనుసంధాన వేదిక ద్వారా గాలింపు చర్యలు ప్రారంభించారు. మరోవైపు ప్రభుత్వం అన్వేషిస్తోంది.

భోగాపురం బీచ్‌లో అదితి మృతదేహం: గుర్తించి కుప్పకూలిన తండ్రి
సోమవారం నాడు 'ఫైండింగ్ అదితి' పేరుతో ఫేస్‌బుక్‌లో ఖాతాను తెరిచారు. ఈ నెల 24వ తేదీ నుంచి అదితి కనిపించడం లేదని, ఆ రోజున ఆమె గులాబీ రంగు గౌను, గులాబీ రంగు పాఠశాల సంచితో ఉందని, ఆచూకీ తెలిసిన వారు తప్పకుండా సమాచారం ఇవ్వగలరని అదితి బాబాయి ఫేస్‌బుక్‌లో విజ్ఞప్తి చేశారు.

భోగాపురం బీచ్‌లో అదితి మృతదేహం: గుర్తించి కుప్పకూలిన తండ్రి
అదితి తండ్రి మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయనకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం కావాలన్నా అందిస్తామని చెప్పారు.

భోగాపురం బీచ్‌లో అదితి మృతదేహం: గుర్తించి కుప్పకూలిన తండ్రి
బుధవారంనాడు అదితి తండ్రి మీడియాతో మాట్లాడుతూ... తమ పాప బతికే ఉందని నమ్ముతున్నామని, ఆమె ఆచూకీ చెప్పిన వారికి రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించారు. అయితే, ఇంతలోనే బీచ్ వద్ద మృతదేహం కనిపించింది.












Click it and Unblock the Notifications