చంద్రబాబుకు చైనా రాయబారి అనూహ్య లేఖ: దిగ్భ్రాంతికి గురయ్యానంటూ
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు కుటుంబంలో కరోనా వైరస్ కలకలం చెలరేగింది. చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ కోవిడ్ బారిన పడ్డారు. వారిద్దరూ హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో వైద్య చికిత్సను తీసుకుంటున్నారు. తొలుత నారా లోకేష్‌కు కరోనా వైరస్ సోకింది.
ఆ మరుసటి రోజే- చంద్రబాబు నాయుడు కూడా మహమ్మారి బారిన పడ్డారు. టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుకు కూడా కోవిడ్ సోకింది. ఈ విషయం తెలిసిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా వైరస్ బారిన పడ్డ చంద్రబాబు త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్థనలు చేశారు.

మాజీమంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, కిమిడి కళా వెంకట్రావ్, పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం జిల్లా నాయకురాలు గౌతు శిరీష, కృష్ణా జిల్లా టీడీపీ నాయకుడు, పొలిట్‌బ్యురో సభ్యుడు వర్ల రామయ్య, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు వంటి నాయకులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. చంద్రబాబు, నారా లోకేష్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని, తిరిగి ప్రజల తరఫున పోరాడాలని అకాంక్షించారు.
Recommended Video
చంద్రబాబు కరోనా వైరస్ బారిన పడటం పట్ల తాజాగా భారత్‌లోని చైనా రాయబారి సన్ వీడాంగ్ సైతం దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన చంద్రబాబుకు లేఖ రాశారు. చంద్రబాబు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలినట్టు తనకు తెలిసిందని చెప్పారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ లేఖను తెలుగుదేశం పార్టీ నాయకులు తమ అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications