చినజీయరుస్వామి సంచలన వ్యాఖ్యలు
సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వాలు ప్రజలను బద్ధకస్తులుగా మారుస్తున్నాయని చినజీయర్ స్వామి(Chinna Jeeyar Swamy) వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో విజయ డెయిరీ నూతన యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చినజీయరుస్వామి మాట్లాడుతూ.. ప్రభుత్వాలు రకరకాల రాయితీలు ఇస్తున్నాయని, పుడితే ఒకటి, పోతే ఒకటి, కూర్చుంటే ఒకటి, నడిస్తే ఒకటి, పడుకుంటే మరొకటి, తింటే రాయితీ, తినకపోతే రాయితీ.. ఇలా ప్రతిదానికీ రాయితీలిస్తున్నాయని విమర్శించారు.
వీటివల్ల ప్రజల్ని బద్ధకస్తులుగా, బలహీనులుగా తయారు చేస్తున్నారన్నారు. అన్నీ మన ఇంటికే తెచ్చిస్తుంటే ఇంకా పనెందుకు అనే ధోరణిలో ప్రజలు ఉన్నారని చినజీయర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఎవరికివారు ఈ వ్యాఖ్యలను అన్వయిస్తున్నారు. ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా, మరో రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా అన్వయాలు జరుగుతున్నాయి.

మిగ్‌జాం తుపాను ప్రభావంతో తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం పర్యటించనున్నారు. వాకాడు మండలం బాలిరెడ్డిపాలెంలో దెబ్బతిన్న స్వర్ణముఖి రివర్ బ్యాంక్‌ను, అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను పరిశీలిస్తారు. అనంతరం తుపాను బాధిత ప్రజలతో మాట్లాడతారు. అక్కడి నుంచి బాపట్ల జిల్లాకు వెళ్లి కర్లపాలెం మండలం, పాతనందాయపాలెం వద్ద నీటిలో ఉన్న మిర్చి పంట, బుద్దాం వద్ద తుంగభద్ర కాల్వ పక్కనే నీట మునిగిన వరి పంటను పరిశీలించనున్నారు.












Click it and Unblock the Notifications