రేవంత్! ఇది నీకు తగునా: ఏపీ మంత్రి చినరాజప్ప ఆగ్రహం

Subscribe to Oneindia Telugu

పశ్చిమగోదావరి: తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ హోంమంత్రి చినరాజప్ప మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీలో అంచెలంచలుగా ఎదిగిన రేవంత్‌రెడ్డి తానున్న పార్టీపైనా, మంత్రులు, నాయకులపైనా బురదచల్లే విధంగా విమర్శలు చేయడం అవివేకమని అన్నారు.

Revanth Reddy Join The Congress By November-End ’హస్తం’ పార్టీలో రేవంత్ | Oneindia Telugu
ఇది సరికాదు రేవంత్..

ఇది సరికాదు రేవంత్..

సోమవారం సోమేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన సందర్భంగా చినరాజప్ప మీడియాతో మాట్లాడారు. రాజకీయ నాయకులు పార్టీలు మారడం షరా మామూలేనని, అయితే అనేక పదవులు అనుభవించి పార్టీని వీడే సమయంలో ఆ పార్టీపై, నాయకులపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

కవిత, జగన్‌‌లతో రేవంత్, కేసీఆర్ భేటీ, ఢిల్లీ చిట్టా విప్పుతా: పయ్యావుల సంచలనం

బురద జల్లడం ఎందుకు..

బురద జల్లడం ఎందుకు..

రేవంత్‌రెడ్డికి టీడీపీలో కొనసాగడంలో ఇబ్బందులు ఉంటే నేరుగా పార్టీ మారుతున్నట్టు చెప్పాలి తప్ప, మరొకరిపై బురదజల్లడం సరైన పద్ధతి కాదని చినరాజప్ప హితవు పలికారు.

జగన్ నిర్ణయంపై వంగవీటి రాధా అసంతృప్తి: అసలేం జరిగింది?

ఆరోపణలు సరికాదు.. చింతలను సీఎం చూసుకుంటారు..

ఆరోపణలు సరికాదు.. చింతలను సీఎం చూసుకుంటారు..

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుతో ఏపీ మంత్రులకు బంధాలున్నాయని చెప్పడం భావ్యం కాదన్నారు. దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ దాడుల వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చూసుకుంటారని చినరాజప్ప స్పష్టం చేశారు.

రేవంత్ విమర్శలు ఇలా..

రేవంత్ విమర్శలు ఇలా..

కాగా, ఏపీ మంత్రులు, టీడీపీ నేతలపై రేవంత్ రెడ్డి ఇటీవల తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఏపీ మంత్రులు పరిటాల సునీత, యనమలకు తెలంగాణలో వ్యాపారాలున్నాయని, అందుకే కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌తో పయ్యావుల భేటీపైనా రేవంత్ విమర్శలు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh minister Chinna Rajappa on Monday fired at TTDP leader Revanth Reddy for his comments.
Please Wait while comments are loading...