2024 ఎన్నికల్లోపు ఏపీలో మారబోతున్న రాజకీయ పరిణామాలు?
2024లో ఏపీ అసెంబ్లీకి జరగబోయే ఎన్నికలు తెలుగదేశం, కాంగ్రెస్ పార్టీ మధ్యే జరుగుతాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు త్వరలోనే మారబోతున్నాయని జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కన్యాకుమారిలో మొదలై ప్రస్తుతం మహారాష్ట్రకు చేరిందన్నారు. ఛిన్నాభిన్నమవుతున్న దేశాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఏకం చేస్తోందన్నారు. దేశంలో నోట్ల రద్దువల్లే ఆర్థిక కష్టాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, దళితుల సంక్షేమ పథకాలు ఎత్తేసి వారికి ద్రోహం చేస్తోందని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ, బీజేపీలు తుడిచిపెట్టుకుపోతాయని, ఎన్నికల యుద్ధం కాంగ్రెస్, టీడీపీ మధ్యే జరుగుతుందని స్పష్టం చేశారు.

ఒకవైపు దేశంలో అధ్వాన్న పాలనతో బీజేపీ అప్రతిష్ట మూటగట్టుకుందని, కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారం చేపట్టినప్పుడే దేశాన్ని బాగుచేయడం కుదురుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆర్థిక సంస్కరణలను అమలుచేసి దేశాభివృద్ధికి రాచబాట పరిస్తే లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను కూడా ప్రయివేటుపరం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర.. కాశ్మీర్ వరకు సాగనుంది.. ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ యాత్ర ముగిసింది. దేశాన్ని సమైక్యం చేసేందుకు భారత్ జోడో యాత్ర చేపట్టినట్లు రాహుల్ గాంధీ పలు వేదికలపై స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications