చంద్రబాబు మారిపోయారు, బొక్కబోర్లా..!!
కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ఈవీఎం ట్యాంపరింగ్ వందశాతం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో ఏ ఒక్క పథకం అమలు చేయలేకపోయిందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం ఎవరి వల్లా కాదన్నారు. అమరావతి పూర్తి చేయాలంటే మరో వందేళ్ల పడుతుందని చెప్పిన చింతా.. చంద్రబాబు పూర్తిగా మారిపోయారన్నారు. దీని పైన ఆసక్తి కర విశ్లేషణ చేసారు.
ఈవీఎం ట్యాంపరింగ్
ఈవీఎంల పైన కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ పలు ఆరోపణలు చేసారు. ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుందని ఎలన్ మస్క్ లాంటి వారు చెప్పారని గుర్తు చేసారు. ప్రతిపక్షాలను దెబ్బ తీసేందుకు అధికార పార్టీ ఈ ప్రయోగాలు చేస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యం నిలబడాలంటే బ్యాలెట్ పోలింగ్ విధానం కావాలని డిమాండ్ చేశారు. మితిమీరిన విశ్వాసంతోనే హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. తెలంగాణ సెక్రటేరియట్ రాజభోగంలా ఉంటే.. ఆంధ్రాలో ఐదు షెడ్‌లు వేసి సెక్రటేరియట్ అంటున్నారని ఎద్దేవా చేసారు.

పోలవరం పూర్తి కాదు
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు .. ప్రభుత్వ ఏర్పడి నాలుగు నెలలు అయినా బడ్జెట్ ప్రవేశ పెట్టలేకపోయారని చింత మోహన్ విమర్శించారు. నాలుగు నెలల కాలంలో ఏ పథకం పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. నలుగురు ముఖ్యమంత్రులతో పని చేసిన రిటైర్డ్ ఐఏఎస్ చెప్పిన సమచారా ప్రకారం.. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదన్నారు. ప్రపంచంలో మూడు కంపెనీలు తప్ప.. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం ఎవరి వల్లా కాదన్నారు. రాజధాని అమరావతిలో చెన్నై నుంచి రియల్టర్లు వచ్చి భూముల ధరలను పెంచేస్తున్నారని ఆరోపించారు. అమరావతి నిర్మాణం పూర్తి కావాలంటే ఇంకా 100 ఏళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు.
తిరుపతి లడ్డూపై
తిరుపతి లడ్డూ పై అవాస్తవాలను ప్రచారం చేసి చంద్రబాబు బొక్కబోర్లా పడ్డారన్నారు. సూపర్ 6 పథకాలను అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్‌కు చంద్రబాబు నాంది పలుకుతున్నారని ఆరోపించారు. జగన్, షర్మిల మధ్య వ్యవహారం వ్యక్తిగతం అన్నారు. గత చంద్రబాబుకు ఇప్పటికీ బాబుకు చాలా తేడా ఉందన్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పెద్దల వద్ద సాగిల పడుతున్నారని విమర్శించారు. పేదలకు కావలసింది తక్కువ ధరలో నిత్యావసర సరుకులు, ఉపాధి కల్పన అని పేర్కొన్నారు. అమరావతిలో డ్రోన్స్ ఎగువరేయడం వలన లాభ ఏంటని చింతా మోహన్ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications