వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ : అనుమానాస్పదంగా విశాఖ ఏజెన్సీలో ; అరెస్ట్ చేసిన చింతపల్లి పోలీసులు

|
Google Oneindia TeluguNews

దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ జిల్లాలో మావోయిస్టు ప్రభావిత మారుమూల ఏజెన్సీ ప్రాంతాలలో ఆయన అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశామని వెల్లడించారు . ప్రస్తుతం చింతమనేని ప్రభాకర్ విశాఖ జిల్లా చింతపల్లి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కోర్టుకు ఈరోజు సెలవు కావడంతో మెజిస్ట్రేట్ ముందు ఆయనను హాజరు పరుస్తారా లేదా అన్న అనుమానం వ్యక్తమవుతోంది.

పెట్రోల్, డీజిల్ ధరలపై టీడీపీ పోరు .. గ్యాస్ సిలెండర్ కు పాడె కట్టి, ట్రాక్టర్లు, ఆటోలు తాళ్ళతో లాగి నిరసనలుపెట్రోల్, డీజిల్ ధరలపై టీడీపీ పోరు .. గ్యాస్ సిలెండర్ కు పాడె కట్టి, ట్రాక్టర్లు, ఆటోలు తాళ్ళతో లాగి నిరసనలు

 పెట్రోల్, డీజిల్ ధరలపై ధర్నా చేసిన చింతమనేని, విశాఖలో అరెస్ట్

పెట్రోల్, డీజిల్ ధరలపై ధర్నా చేసిన చింతమనేని, విశాఖలో అరెస్ట్


ఇప్పటికే టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ పై పెట్రోల్, డీజిల్ ధరలపై ధర్నా చేసిన కారణంగా దెందులూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. దెందులూరులో పెట్రోల్ ధరలపై చింతమనేని ఆందోళనకు దిగిన క్రమంలో ఎమ్మార్వో ఆఫీస్ కి వెళ్తున్న చింతమనేనిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని చింతమనేనిపై దెందులూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇక చింతపల్లి పోలీసులు చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేయడంతో చింతపల్లి పిఎస్ దగ్గరే పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు సైతం మకాం వేశారు.

అనుమానాస్పదంగా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో తిరిగారన్న పోలీసులు

అనుమానాస్పదంగా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో తిరిగారన్న పోలీసులు

అసలు ఇంతకీ చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ పై పోలీసులు ఏం చెబుతున్నారంటే పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు మావోయిస్టు ప్రభావిత మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో గ్రామాలలో ప్రత్యేకంగా చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు విశాఖ రూరల్ ఎస్పీ . గంజాయి అక్రమ దందా వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడం, మూగజీవాల అక్రమ రవాణా, మావోయిస్టు సానుభూతి పరుల కదలికలపై నిఘా ఉంచిన క్రమంలో చెక్ పోస్ట్ వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని విశాఖ రూరల్ ఎస్పీ వెల్లడించారు.

వాహన తనిఖీలలో అనుమానాస్పదంగా చింతమనేని తీరు

వాహన తనిఖీలలో అనుమానాస్పదంగా చింతమనేని తీరు

ఈ క్రమంలో దారకొండ ఏజెన్సీ ప్రాంతంలో కొంతమంది పదికి పైగా వాహనాలలో వచ్చి అలజడి సృష్టించి వెళుతున్నట్లుగా ఇక గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారని, ఈ సమాచారం మేరకు చెక్ పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేయగా చింతమనేని ప్రభాకర్ అనుమానాస్పదంగా అందులో కనిపించారని వెల్లడించారు. ప్రాథమిక విచారణలో అనుమానాస్పదంగా ఏజెన్సీ గ్రామాలలోకి వెళ్లడానికి వచ్చిన వ్యక్తి టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అని గుర్తించామని, అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెబుతూ పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చింతమనేని ప్రభాకర్ చేశారని వెల్లడించారు.

 చింతమనేని అరెస్ట్.. ఆ వాహనాల కోసం గాలింపు

చింతమనేని అరెస్ట్.. ఆ వాహనాల కోసం గాలింపు

ఈక్రమంలోనే చింతమనేని ప్రభాకర్ ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. చింతమనేని ప్రభాకర్ తో పాటుగా మరికొన్ని వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నామని, ప్రత్యేక బృందాలతో చింతమనేని తో పాటు వచ్చిన వాహనాల కోసం గాలింపు జరుపుతున్నామని విశాఖ రూరల్ ఎస్పీ వెల్లడించారు. అయితే చింతమనేని ప్రభాకర్ విశాఖ జిల్లా నర్సీపట్నం లోని ఓ వివాహ వేడుకకు హాజరైన క్రమంలో ఆయనను అరెస్టు చేసినట్లుగా చింతమనేని అనుచరులు చెబుతున్నారు. అయితే రూరల్ ఎస్పీ అనుమానాస్పదంగా ఏజెన్సీ ప్రాంతాల్లో సంచరించారని, పోలీసులు అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానం చెప్పారని అందుకే అరెస్ట్ చేశామని చెప్పడం గమనార్హం.

Recommended Video

5.1 తీవ్రతతో Earthquake.. AP, Tamil Nadu లోని పలు ప్రాంతాల్లో కంపించిన భూమి..! || Oneindia Telugu
 ఇప్పటికే చింతమనేనిపై కుప్పలు తెప్పలుగా కేసులు

ఇప్పటికే చింతమనేనిపై కుప్పలు తెప్పలుగా కేసులు

ఇప్పటికే చింతమనేని ప్రభాకర్ పై వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏ చిన్న కార్యక్రమం చేసినా వరుసగా కేసులు నమోదవుతున్నాయి. దళితులను దూషించిన కేసులో చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదు కాగా, ఆపై ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళటం, అనేక నాటకీయ పరిణామాల మధ్య చింతమనేని అరెస్ట్ కావటం, ఆపై ఆయనను జైలుకు తరలించటం తెలిసిందే. గత ఎన్నికల సమయంలో కూడా ఆయనపై ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు కేసులు నమోదయ్యాయి. అంతకుముందు చింతమనేని ప్రభాకర్ పై యాభైకి పైగా కేసులు ఉన్నట్టు సమాచారం.

English summary
Former Denduluru MLA and TDP leader Chintamani Prabhakar has been arrested by the police. He was arrested by the police who found him roaming suspiciously in Maoist-affected remote agency areas in Visakhapatnam district. It is learned that Prabhakar is currently in the custody of Chintapalli police in Visakhapatnam district. As the court is on holiday today, it is doubtful whether he will appear before the magistrate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X