ఆఖరి ప్రయత్నం: హైదరాబాద్‌పై చిరు పట్టు, అసంతృప్తి
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఢిల్లీ విభజన, హైదరాబాదు యూటిపై ఇదే తమ ఆఖరి ప్రయత్నమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి అభిప్రాయపడ్డారు. ఆయన కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, మంత్రుల బృందం (జివోఎం) సభ్యులు జైరాం రమేష్‌లను మంగళవారం కలిశారు. భేటీ అనంతరం విలేకరులు అడగ్గా ఇదే తమ ఆఖరి ప్రయత్నమని చెప్పారు.
ఈ భేటీలో ప్రధానంగా హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతం పైన చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర విభజన అనివార్యమైన నేపథ్యంలో సీమాంధ్ర ప్రజల సెంటిమెంటును గుర్తించి హైదరాబాదును శాశ్వతంగా యూటి చేయాలని ఆయన షిండే, జైరాంలను కోరారు. అయితే, వారి నుండి సానుకూల స్పందన రాలేదని సమాచారం.

ఆంక్షలు లేని తెలంగాణ: మోత్కుపల్లి
సిడబ్ల్యూసి తీర్మానం మేరకు కాంగ్రెసు పార్టీ ఆంక్షలు లేని తెలంగాణ ఇచ్చి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు నల్గొండ జిల్లాలో అన్నారు. రాయల తెలంగాణ నినాదాన్ని తెరపైకి తెచ్చి కాంగ్రెసు, తెరాసలు దొంగ నాటకాలు ఆడుతున్నాయన్నారు.
గతంలో తెలంగాణకు అనుకూలంగా తమ పార్టీ ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉందన్నారు. 2014 ఎన్నికల్లో లబ్ధి పొందే ఉద్దేశ్యంతో కెసిఆర్, సోనియాలు తెలంగాణ అంశాన్ని సాగదీస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications