గరికపాటిvsచిరంజీవి: వివాదంపై తొలిసారిగా పెదవి విప్పిన చిరు

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమం సందర్భంగా వేదికపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వివాదంపై తొలిసారిగా చిరంజీవి పెదవి విప్పారు. చిరు ఫొటో సెషన్ ఆపకపోతే తాను కార్యక్రమం నుంచి వెళ్లిపోతా అంటూ గరికపాటి వ్యాఖ్యలు చేశారు. దీంతో చిరంజీవి ఫొటోలు దిగడం ఆపేశారు.

పెద్దాయన వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సిన అవసరం లేదు

పెద్దాయన వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సిన అవసరం లేదు

హైదరాబాద్ లో జరిగిన గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లో విలేకర్లు గరికపాటి వివాదంపై స్పందించాలని చిరంజీవిని కోరారు. ''ఆయన పెద్దాయన.. ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సిన అవసరం లేదు'' అని తెలిపారు. చిరు స్పందనతో ఈ వివాదానికి దాదాపుగా ముగింపు పలికినట్లైనంది. మరోసారి ఆచార్య ఫ్లాపవడంపై చిరు స్పందించారు. ఏ సినిమా ఫ్లాపైనా తాను బాధ్యత తీసుకుంటానని, ఆచార్య ఫెయిలైనందుకు బాధపడలేదన్నారు. 80 శాతం పారితోషికాన్ని తాను, రామ్ చరణ్ వెనక్కిచ్చేశామన్నరు. తను ఆర్‌ఆర్‌ఆర్‌ విజయంకన్నా'గాడ్‌ఫాదర్‌' సక్సెస్‌నే ఎక్కువగా ఆస్వాదిస్తున్నాడని తెలిపారు.

దీపావళి రోజు బాబీ సినిమా మోషన్ పోస్టర్ విడుదల

దీపావళి రోజు బాబీ సినిమా మోషన్ పోస్టర్ విడుదల

తాను చేస్తున్న సినిమాలన్నీ వేసవికల్లా విడుదలవుతాయని కొత్త ప్రాజెక్టులు మార్చిలో ప్రారంభిస్తానన్నారు. బాబీ సినిమాలో తన క్యారెక్టర్ ఫుల్ మాస్ లుక్ లో ఉంటుందని, సంభాషణలన్నీ తూర్పుగోదావరి జిల్లా యాసలో ఉంటాయన్నారు. దీపావళి రోజు ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్, టైటిల్ విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

నాగబాబు జోక్యంతో పెద్దదైన వివాదం

నాగబాబు జోక్యంతో పెద్దదైన వివాదం

చిరంజీవి సోదరుడు నాగబాబు గరికపాటి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ''ఏ పాటి వాడికైనా చిరంజీవి ఇమేజ్‌ని చూస్తే.. ఆపాటి అసూయ కలగడం పరిపాటేనని'' వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. నాగబాబు ట్వీట్ చేసిన తర్వాతే వివాదం పెద్దదైంది. ఆయన చేసిన వ్యాఖ్యలకు ఆలిండియా బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు ద్రోణంరాజు రవికుమార్ ఘాటుగా స్పందించారు.

''ఆహార్యానికి అవధానానికి తేడా తెలియని మాయారంగం, నిత్యం తన ప్రవచనాలతో సమాజాన్ని సంస్కారవంతం చేస్తున్న ఒక సనాతనవాదికి, సమాజంతో నటనా వ్యాపారం తప్ప సమాజహితాన్ని మరచిన చిత్రవ్యాపారిని చూసి అసూయ చెందారనడం ఆకాశం మీద ఉమ్మేయడం లాంటిదే.. చిడతలు కొట్టే వాడు కూడా సంగీత విద్వాంసులమని ట్వీట్లలో కూనిరాగాలాపన చేస్తే ఎలా?'' అంటూ పేరు ప్రాస్తావించకుండానే ఘాటువ్యాఖ్యలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+