Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ రాజకీయాల్లో "మెగా" ట్విస్ట్ - చిరంజీవి కీలక ప్రకటన..!! (వీడియో)

ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన చిరంజీవి కీలక ప్రకటన చేసారు. ఏపీలో కూటమి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్దులకు మద్దతు ఇవ్వాలని అభ్యర్దించారు. తాజాగా చిరంజీవి తన సోదరుడు పవన్ కు జనసేన కోసం అయిదు కోట్ల విరాళం ఇచ్చారు. కూటమి నుంచి పోటీ చేస్తున్న పలువురు అభ్యర్దులు చిరంజీవిని కలిసి మద్దతు కోరుతున్నారు. ఈ సమయంలో చిరంజీవి కీలక ప్రకటన చేసారు.

చిరంజీవి ప్రకటన
మెగాస్టార్ చిరంజీవి రాజకీయంగా ఆసక్తి కర ప్రకటన చేసారు. గతంలో చిరంజీవితో ప్రజారాజ్యంలో కలిసి పని చేసిన నేతలు...మెగాస్టార్ తో సాన్నిహిత్యం ఉన్న నేతలు చిరంజీవిని కలిసి మద్దతు కోరుతున్నారు. తాజాగా బీజేపీ నుంచి అనకాపల్లి ఎంపీ అభ్యర్దిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్..పెందుర్తి నుంచి జనసేన అభ్యర్దిగా పోటీలో ఉన్న పంచకర్ల రమేష్ బాబు ఇద్దరూ చిరంజీవిని కలిసారు. ఆ తరువాత చిరంజీవి ఒక వీడియో విడుదల చేసారు. అందులో తాను చాలా కాలం తరువాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చారు. సీఎం రమేష్ తో తనకు ఉన్న అనుబంధాన్ని వివరించారు. పంచకర్ల రమేష్ ప్రజారాజ్యం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన అంశాన్ని ప్రస్తావించారు.

Chiranjeevi extends his upport for NDA contesing candidates in AP leads to new turn

కూటమి అభ్యర్దులకు మద్దతు
తమ్ముడు పవన్, చంద్రబాబు, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న సమయంలో సీఎం రమేష్ ను గెలిపించుకోవటం ద్వారా ఢిల్లీ ద్వారా మంచి చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేసారు. సీఎం రమేష్, పంచకర్ల రమేష్ ను గెలిపించాలని కోరారు. వారికి తన మద్దతు ప్రకటించారు. కొద్ది కాలం క్రితం తమ్ముడు పవన్ రాజకీయంగా ఉన్నత స్థానాల్లో ఉండాలని తాను కోరుకున్నానంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే, చిరంజీవి రాజకీయంగా ఎక్కడా ప్రత్యక్షంగా ప్రమేయం లేకుండా జాగ్రత్త పడ్డారు. తాజాగా చిరంజీవిని సోదరులు నాగబాబు, పవన్ కలిసారు. వారికి రూ 5 కోట్ల విరాళం చిరంజీవి అందించారు. దీని ద్వారా జనసేనకు పరోక్షంగా మద్దతు ప్రకటించారు.

కూటమికి కలిసొచ్చేనా
ఇప్పుడు బీజేపీ, జనసేన నుంచి పోటీ చేస్తున్న అభ్యర్దులకు చిరంజీవి నేరుగా మద్దతు ప్రకటించటంపైన సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ కు చిరంజీవి రాజీనామా చేయకుండా ఎన్డీఏ కూటమి అభ్యర్దులకు మద్దతుగా నిలవటం ఏంటని నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే, చిరంజీవి ఈ ఇద్దరు అభ్యర్దుల గురించి ప్రత్యేకంగా వీడియోలో ప్రస్తావించారు. అయితే, చిరంజీవి మద్దతు కూటమికి ఉందనే చర్చ వినిపిస్తోంది. ఎన్నికల సమయంలో చిరంజీవి చేసిన ఈ ప్రకటన ద్వారా ఇప్పుడు రాజకీయంగానూ చిరంజీవిని ప్రత్యర్ది పార్టీలు లక్ష్యంగా చేసుకొనే అవకాశం ఉంది. దీంతో.. చిరంజీవి ప్రకటన తరువాత రాజకీయంగా ఏం జరుగుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+