అమావాస్య రోజున జనసేనకు చెక్కు ఇచ్చిన చిరంజీవి
సాధారణంగా అమావాస్య అంటే చాలామంది భయపడుతుంటారు. కొందరు అమావాస్య రోజున బయటకు రారు. అమావాస్య రోజున ఎటువంటి కార్యక్రమాలు కూడా మొదలుపెట్టడానికి ఇష్టపడరు. ఇక శుభకార్యక్రమాలు అయితే అమావాస్య దాటిన తరువాతే పెట్టుకుంటారు. అలాంటిది జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మెగాస్టార్ చిరంజీవి రూ.5 కోట్ల రూపాయిల చెక్కును అమావాస్య రోజునే అందజేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..
గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్..ఈసారి అలాంటి తప్పులు జరగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈసారి కాపులు అధిక సంఖ్యలో ఉండే పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారాయాన. దీనిలో భాగంగానే నియోజకవర్గంలో విసృతంగా ప్రచారం నిర్వహించారాయన. ఈక్రమంలోనే పవన్ కల్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు.చికిత్స అనంతరం కోలుకున్న పవన్ కల్యాణ్.. తన అన్న చిరంజీవి షూటింగ్ జరుగుతున్న లొకేషన్‌కి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.

ఆ సమయంలోనే తమ్ముడు జనసేన పార్టీకి చిరంజీవి రూ. 5 కోట్ల రూపాయిలు ఇస్తున్నట్టు ప్రకటించారు. రూ. 5 కోట్ల రూపాయల చెక్‌ను పవన్ కల్యాణ్‌కు అందజేశారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి చిరంజీవి ఎన్నికల నిర్వాహణ నిమిత్తం ఈ ఐదు కోట్ల రూపాయల చెక్కును అందజేసినట్లుగా తెలుస్తోంది. చిరంజీవి తొలిసారి జనసేనకు సంబంధించి తన విరాళాన్ని అందజేశారు. గతంలో మెగా హీరోలు, నాగబాబు, పవన్ కల్యాణ్ తల్లి, చిరంజీవి భార్య సురేఖ మొదలగు వారు జనసేన పార్టీకి విరాళం ఇచ్చారు. మొదటిసారి చిరంజీవి తమ్ముడు పార్టీకి భారీ మొత్తంలో విరాళాన్ని అందజేశారు.
ఇక్కడ వరకు బాగానే ఉన్నప్పటికీ చిరంజీవి విరాళం ఇచ్చిన రోజు అమావాస్య అని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. సెంటిమెంట్ ఫాలో అయ్యేవారు అమావాస్య రోజున ఏదైనా మంచి పని ప్రారంభించడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. వాస్తవానికి సోమవారం అమావాస్య, పైగా సూర్యగ్రహణం అలాంటి రోజున జనసేనకు చిరంజీవి చెక్ ఇచ్చారేంటనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎలాంటి దుష్ప్రభావం పడకూడదని జనసేన కార్యకర్తలు కోరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications