పరిటాల: బాబుపై చిరంజీవి, కాంగ్రెస్‌లోకి టిడిపి ఎమ్మెల్యే
అనంతపురం/న్యూఢిల్లీ: దివంగత పరిటాల రవీంద్ర హత్య కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న వారిని తెలుగుదేశం పార్టీలో ఎలా చేర్చుకుంటారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ప్రచార సారథి చిరంజీవి ప్రశ్నించారు. గురువారం సీమాంధ్ర కాంగ్రెసు నేతల బస్సుయాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు.
కాంగ్రెసు పార్టీని కొందరు నేతలు మోసం చేశారన్నారు. చంద్రబాబు బిజెపితో పొత్తుకు సిద్ధమవుతున్నారని, ఆయనను నమ్మి మైనార్టీలు మోసపోవద్దన్నారు. విభజన విషయంలో కేవలం కాంగ్రెసు పార్టీని మాత్రమే తప్పు పట్టడం సరికాదన్నారు. టిడిపి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిందని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆర్టికల్ 3 ప్రకారం విభజన చేయాలని చెప్పిందని, తాము అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తామని బిజెపి చెప్పిందని.. ఇలా అన్ని పార్టీలు చెప్పాకే కాంగ్రెసు పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు.

విభజన విషయంలో కాంగ్రెసును తప్పుపట్ట వద్దన్నారు. కాంగ్రెసు పార్టీ నాయకులను చంద్రబాబు తమ పార్టీలో ఎలా చేర్చుకుంటున్నారన్నారు. అప్పుడు అవినీతిపరులుగా కనిపించిన నేతలు.. ఇప్పుడు తమ పార్టీలో చేరగానే నిజాయితీపరులు అవుతారా అన్నారు.
కాంగ్రెసులోకి సుద్దాల దేవయ్య
కరీంనగర్ జిల్లా చొప్పదండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య కాంగ్రెస్‌లో చేరారు. ఢిల్లీలో దిగ్విజయ్ సింగ్, తెలంగాణ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
-
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి












Click it and Unblock the Notifications