తప్పు చేయం - ఒక వేళ చేస్తే : వాళ్ల ఇంటికి వెళ్లి కూర్చున్నా - చిరంజీవి..!!
మెగాస్టార్ చిరంజీవి తన బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ ఎంత పెరిగిందనే దాని కంటే..తన హృదయానికి ఎంత మందిని దగ్గరగా తీసుకున్నా అన్నది ముఖ్యమని చెప్పారు. తనపైన ఎంతో మంది ఎన్నో ఆరోపణలు చేసారని..నిజం నిలకడ మీద తెలుసుకొని అందరూ ఆ తరువాత కాలంలో తన వద్దకే వచ్చారని మెగాస్టార్ చెప్పుకొచ్చారు. గాడ్ ఫాదర్ సక్సెస్ తో చిరంజీవి తన మనసులోని అభిప్రాయాలను పంచుకున్నారు. ఎవరైనా సంయమనం పాటించడం ముఖ్యమని చెప్పిన చిరంజీవి..అడుగు వెనక్కి తగ్గడం కాదన్నారు. సంయమనం పాటిస్తే నిజానిజాలు నిలకడమీద బయటకొస్తాయని వ్యాఖ్యానించారు.

బ్లడ్ బ్యాంకుపై ఆరోపణలు చేసారు
తాను తప్పు చేయననేది తన నమ్మకమని.. తప్పు చేస్తే పొరపాటు అయ్యిందని ఒప్పుకుంటానని స్పష్టం చేసారు. తప్పు లేకుండా ఆరోపణ చేస్తే.. వెంటనే ఢీకొట్టాల్సిన అవసరం లేదని చిరంజీవి అభిప్రాయ పడ్డారు. ఏదైనా నిజం నిలకడపై తెలుస్తుందనేది తాను పూర్తిగా నమ్ముతానని చెప్పుకొచ్చారు. అలా నమ్మాను కాబట్టే బ్లడ్ బ్యాంక్ మీద..రాజకీయాల్లోకి..వచ్చినప్పుడు.. భూ కబ్జా చేశాను అన్నప్పుడు తాను స్పందించలేదని చిరంజీవి గతంలో వచ్చిన ఆరోపణలు- ఆ తరువాత పరిణామాలను గుర్తు చేసుకున్నారు. తన తప్పు లేనప్పుడు నేను ఎందుకు ఉలిక్కిపడాలని ప్రశ్నించారు. తన మీద విమర్శలు చేసిన వారే ఆ తరువాత కోర్టు ద్వారానో..వారి అంతరాత్మ ద్వారానో నిజం తెలుసుకొని తనకు సరెండర్ అయ్యారని వివరించారు.

విమర్శించిన వారే దగ్గరకు వచ్చారు
తనను విమర్శించిన వారు.. ఎద్దేవా చేసినవారు దగ్గరకు వస్తే తాను ఆలింగనం చేసుకున్నానంటూ పలు సందర్భాలను గుర్తు చేసారు. తనకు తెలిసిన ఫిలాసఫీ ఇదేనని చెప్పారు. తాను తప్పు చేయననే గట్టి నమ్మకంతోనే ముందుకు వెళ్తున్నానన్నారు. తన తప్పు ఉంటే అందరికంటే తాను ముందుకు వస్తానంటూ ప్రజారాజ్యం ప్రకటన సమయంలో చోటు చేసుకున్న ఘటనలను పరోక్షంగా ప్రస్తావించారు. తాను రాజకీయాల్లోకి వస్తానంటే విమర్శించిన వారి కార్లపైన రాళ్లు విసిరారని గుర్తు చేసారు. నాడు చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ పైన సినీ రంగానికి చెందిన వ్యక్తి చేసిన కామెంట్స్ పై మెగా ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు. దీంతో..ఆయన కారు పైన రాళ్లు వేసారు. వెంటనే చిరంజీవి.. అల్లు అరవింద్ తో కలిసి రాజశేఖర్ ఇంటికి వెళ్లారు.

ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పాను
ఆ సమయంలో ఇంట్లో ఆ వ్యక్తి లేకపోయినా..అక్కడే ఉన్నారు. ఆ తరువాత జరిగిన దాని పైన ఆయనతో మాట్లాడారు. ఫ్యాన్స్ అలా చేయకుండా ఉండాల్సిందని విచారం వ్యక్తం చేసారు. ఇప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావించిన చిరంజీవి.. తన తప్పు లేదు కాబట్టే వాళ్ల ఇంటికి వెళ్లానని చెప్పారు. ఫ్యాన్స్ తన మీద అభిమానంతో..అలా జరిగిందన్నారు. ఒక్కోసారి అలా ప్రమేయం లేకుండానే కొన్ని ఘటనలు జరిగిపోతాయన్నారు. తన ఫ్యాన్స్ తప్పు చేసినా వాళ్ల ఇంటికి వెళ్లానని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు చిరంజీవి..తన మీద వచ్చిన ఆరోపణలు- ఆ తరువాత కాలంలో చోటు చేసుకున్న పరిణామాలను ప్రస్తావించటం హాట్ టాపిక్ గా మారింది.












Click it and Unblock the Notifications