Chiranjeevi: తీవ్ర ఒత్తిడిలో చిరంజీవి? వెరీ క్రూషియల్ సిట్యుయేషన్??
మెగాస్టార్ చిరంజీవి తన జీవితకాలంలో ఎప్పుడూ ఎదుర్కోనంత ఒత్తిడిని ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు. బిగ్‌బాస్ సినిమా పరాజయం తర్వాత ఏ తరహా సినిమాలు చేయాలంటూ కొద్దికాలం సినిమాలు చేయడం ఆపేసిన సమయంలోను ఇటువంటి పరిస్థితి ఎదురవలేదు. కానీ ఆచార్య సినిమా ఘోర పరాజయం తర్వాత అసలు ఏ సినిమా చేయాలి? ఏ దర్శకుడితో చేయాలి? ఏ కథను ఎంచుకోవాలి? ఎక్కడి నుంచి ప్రారంభించాలంటూ ఆలోచనలో పడ్డారు. అంత సీనియర్ అయిన చిరంజీవికి కూడా ఇటువంటి పరిస్థితి ఎదురవడంపై ఆయన అభిమానులు మధనపడుతున్నారు.

ఆచార్య తర్వాత లెక్కలన్నీ మారాయి?
ప్రస్తుతం చిరంజీవి సినిమాలు నాలుగు పట్టాలెక్కాయి. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఒకటి, బాబీ దర్శకత్వంలో ఒకటి, మోహన్‌రాజా దర్శకత్వంలో ఒకటి, వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒకటి ఒకదాని తర్వాత ఒకటి షూటింగ్ పూర్తిచేసుకోవాల్సి ఉంది. కానీ తాను ఇప్పుడు చేస్తున్న సినిమాలపై చిరంజీవి పునరాలోచనలో పడ్డారు. ఆచార్య పరాజయం తర్వాతే చిరంజీవికి ఈ ఆలోచన కలిగినట్లు ఫిల్మ్‌నగర్ వర్గాలంటున్నాయి. ఒక్కసారిగా సినిమా లెక్కలు మారిపోయాయంటున్నారు.

యువ దర్శకులవల్ల తన కెరీర్‌కు ప్లస్సా? మైనస్సా?
సెట్స్ పైన ఉన్న సినిమాల స్క్రిప్ట్‌లను మరోసారి రీ రైట్ చేస్తున్నారని, కొన్ని సన్నివేశాలను రీషూట్ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమా చేయాలా? వద్దా? అనే ఆలోచనలో పడ్డారని, దాదాపుగా అది ఆగిపోయినట్లేనని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్త దర్శకులతో వరుసగా సినిమాలు చేయడంవల్ల తన కెరీర్‌కు మైనస్ అవుతుందా? ప్లస్ అవుతుందా? అని విశ్లేషించుకుంటే మైనస్ అవుతుందనే లెక్కలు తేలాయని, అందుకే చిరు పునరాలోచనలో పడ్డారంటున్నారు.

విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాతే..!!
వేసవి విడిది కోసం విదేశాలకు వెళ్లిన చిరంజీవి తిరిగి వచ్చిన తర్వాత ఫైనల్ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. అయితే వెంకీ కుడుముల ప్రస్తుతం స్క్రిప్ట్ తయారుచేస్తున్నారని, చిరంజీవి విదేశాల నుంచి రాగానే వినిపిస్తారని, సెట్స్ పైకి వెళ్లడమే తరువాయి అంటున్నారు. అయితే ఆచార్య తర్వాత చిరంజీవి లెక్కలన్నీ మారిపోయాయని, డిఫెన్స్ లో పడ్డారని, ఆచూతూచి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమాలపై ఆయన అభిమానులకు కూడా నమ్మకం లేదంటే ఎంచుకున్న కథలు, ఎంచుకున్న దర్శకులు అలా ఉన్నారని విశ్లేషిస్తున్నారు. మరి అభిమానులకు చిరంజీవి ఎంతవరకు సంతోషపెడతారో వేచిచూడాలి..!!












Click it and Unblock the Notifications