పొలిటిక్స్: చిరంజీవి సైతం పవన్ కల్యాణ్‌కు డైరెక్ట్‌గా చెప్పలేడా?

హైదరాబాద్: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఏ విషయమైనా డైరెక్ట్‌గా చెప్పలేరని అంటారు. ఆయన ప్రతిస్పందనకు జంకి ఎవరూ ముఖాముఖి సలహాలు ఇవ్వలేరని చెబుతారు. ఆ మాటకు వస్తే అన్నయ్య చిరంజీవి కూడా ఏదైనా పవన్ కల్యాణ్‌కు ముఖం మీద చెప్పలేరని అంటున్నారు.

పవన్ కల్యాణ్ ఓ ప్రముఖ దినపత్రకకు ఇచ్చిన ఇంటర్వ్యూ వల్ల ఆ విషయం అర్థమవుతోంది. పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి రావడం, జనసేన పార్టీని స్థాపించడం చిరంజీవికి ఏ మాత్రం ఇష్టం లేదని సమాచారం. అదే విషయాన్ని ఆయన ఓ మధ్యవర్తి ద్వారా పవన్ కల్యాణ్‌కు చెప్పించారని అంటున్నారు.

Chiranjeevi will also not speak directly with Pawan Kalyan

తనకు చిరంజీవితో రాజకీయ విభేదాలు మాత్రమే ఉన్నాయని, వ్యక్తిగతమైన విభేదాలు లేవని, చిరంజీవితో వ్యక్తిగత సమస్యలు కూడా లేవని పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూలో అంటూ జనసేన విషయంలో చిరంజీవి సంతోషంగా లేరని చెప్పారు. హ్యాపీగా సినిమాలు చేసుకోక ఎందుకు ఈ రాజకీయాలు అని చిరంజీవి అన్నారని పవన్ కల్యాణ్ చెప్పారు.

అయితే, ఆ విషయం తనకు నేరుగా చెప్పలేదని, చిరంజీవి తన అభిప్రాయాన్ని తనకు వేరొకరి ద్వారా అందించారని ఆయన చెప్పారు. దీన్నిబట్టి తెలుగు సినీ రంగంలో చాలా కాలంగా ఊహాగానంగా చెలామణి అవుతున్న విషయం నిజమని తేలింది. తమ అసంతృప్తిని ఎవరూ కూడా, ఆ మాటకు వస్తే చిరంజీవి కూడా పవన్ కల్యాణ్ వద్ద నేరుగా వ్యక్తం చేయరనేది ఆ నిజం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+