రామోజీ సంస్మరణ సభకు చిరంజీవి దూరం..ప్రజారాజ్యం జ్ఞాపకాలు చెరగలేదా..?
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ఇటీవలే అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన సంస్మరణ సభను కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సంస్మరణ సభకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక సినీ ప్రముఖులు సైతం సంస్మరణ సభకు విచ్చేసి రామోజీరావు గొప్పతానాన్ని గుర్తు చేసుకున్నారు.
రాజమౌళి, కీరవాణి,రాఘవేంద్రరావు, అశ్వినీదత్, సురేష్ బాబు వంటి సినీ ప్రముఖులు రామోజీరావు సంస్మరణ సభ హాజరయ్యారు. అయితే ఈ సంస్మరణ సభకు ఇండస్ట్రీ పెద్దగా భావించే మెగాస్టార్ చిరంజీవి దూరంగా ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు రామోజీరావు సంస్మరణ సభకు చిరంజీవికి ఆహ్వానం అందిందా లేదా అనేది తెలియడం లేదు. ఒకవేళ ఆహ్వానం అందితే ఆయన ఎందుకు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

అయితే గతంలో చిరంజీవికి వ్యతిరేకంగా రామోజీరావు తన ఈనాడు పత్రికలో అనేక కథనాలు ప్రచురించడం జరిగింది. చిరంజీవి ప్రజారాజ్యం రాజకీయ పార్టీని స్థాపించిన దగ్గర నుంచి కూడా ఆ పార్టీకి వ్యతిరేకంగా కక్ష్యపూరిత కథనాలు ఈనాడులో ప్రసారం చేశారు. ముఖ్యంగా 2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం దారుణంగా ఓడిపోయింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ వల్లే ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిందనే భావన ఆ పార్టీ నాయకుల్లో కనిపించింది. ఈ విషయాన్ని చంద్రబాబు సైతం బహిరంగంగానే చెప్పడం జరిగింది.
ఆ తర్వాత కొద్దికాలానికే ఈనాడు దిన పత్రికలో ప్రజారాజ్యం దుకాణం బంద్ అంటూ పెద్ద శీర్షికను ప్రచురించారు. దీంతో ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రజారాజ్యంపై చర్చ నడిచింది. దీనిపై చిరంజీవి రామోజీరావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవే స్వయంగా ఈనాడు ఆఫీస్ ముందు ధర్నాకు దిగి నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో చిరంజీవి ఈనాడుపై సంచలన ఆరోపణలు చేశారు. రామోజీరావు కేవలం టీడీపీ మాత్రమే అధికారంలోకి రావాలని అనుకుంటారు.

మా జెండాను పీకేయడానికి రామోజీరావు ఎవరని చిరంజీవి ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి రాకపోతే ఈనాడు సంస్థల అధినేత తట్టుకోలేరని , ఎన్టీఆర్‌ను కూడా టీడీపీ నుంచి దూరం చేయడంలో ఆయనదే ప్రముఖ పాత్రం అంటూ చిరంజీవి రామోజీరావును విమర్శించారు. ఇక ఈనాడులో కథనాలు వచ్చిన తర్వాతే ప్రజారాజ్యం నిర్వీర్యం అవుతూ వచ్చింది. ఆ తర్వాత చిరంజీవి పార్టీని ముందుకు తీసుకువెళ్లలేక ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంపై అప్పట్లో పవన్ కల్యాణ్ సైతం తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజారాజ్యం నిర్వీర్యం అవ్వడం వెనుక కొన్ని దుష్టశక్తులు పని చేశాయని అప్పట్లో పవన్ కల్యాణ్ బహిరంగంగానే విమర్శలు చేశారు. ప్రజారాజ్యం నిర్వీర్యం కావడంలో రామోజీరావు పాత్ర కూడా ఉందనే కారణంగానే చిరంజీవి ఆయన సంస్మరణ సభ దూరంగా ఉన్నారనే వాదన తెర మీదకు వస్తోంది.

ఇక ఇటీవల సినిమా టికెట్ల రేట్ల విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసిన వారంతా రామోజీరావు సంస్మరణ సభకు హాజరయ్యారు. కానీ అల్లు అరవింద్ మాత్రం ఈ సంస్మరణ సభకు హాజరు కాలేదు. సినిమా టికెట్ల రేట్ల విషయంలో అన్ని ముందుండి నడిపిన అల్లు అరవింద్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రజారాజ్యం పాత జ్ఞాపకాలు ఇంకా మదిలో ఉండటం వల్లే చిరంజీవి, అల్లు అరవింద్ రామోజీరావు సంస్మరణ సభకు హాజరు కాలేదని తెలుస్తోంది.
-
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !! -
చిరంజీవికి సీనియర్ NTR సినిమాల్లో అదంటే మహా ప్రాణం.. ఎవరూ ఊహించనది -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications