హై అలర్ట్, రంగంలోకి కేంద్ర బలగాలు, హాయ్ హాయ్ నాయకా అంటే పగిలిపోతుంది, సైలెంట్ !
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ కు కౌంట్ డౌన్ మొదలైయ్యింది. సమస్యాత్మిక ప్రాంతాల్లోకి కేంద్ర బలగాలను రంగంలోకి దింపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలు, మండల కేంద్రాల పరిధిలోని సమస్యాత్మక నియోజక వర్గాలు, ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమీషన్ గుర్తించింది. అలాంటి ప్రాంతాల్లో పోలీసు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
చిత్తూరు జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను రంగంలోకి దింపామని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి షన్మోహన్ అన్నారు. శనివారం సాయంత్రం ఆరు గంటల లోపు ఎన్నికల ప్రచారం, ర్యాలీలు పూర్తి చేసుకోవాని అన్ని రాజకీయ పార్టీల నాయకులకు జిల్లా కలెక్టర్ షన్మోహన్ మనవి చేశారు. శనివారం సాయంత్రం ఆరు గంటల తరువాత ఎన్నికల ప్రచారం చేసినా, ర్యాలీలు నిర్వహించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ షన్మోహన్ హెచ్చరించారు.

శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమలులో ఉంటుంది. చివరి రెండు రోజులు చాలా తక్కువ మందితో ఇంటింటి ప్రచారం చేసుకోవడానికి అనుమతి ఉంటుందని జిల్లా కలెక్టర్ చెప్పారు పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఎవ్వరు కూడా ఎన్నికల ప్రచారం చెయ్యకూడదని, అలా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ షన్మోహన్ అన్ని పార్టీల నాయకులను హెచ్చరించారు.
ఓటు లేని వారు జిల్లా నుంచి వదిలివెళ్లిపోవాలని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ సూచించారు.. పోలింగ్ కు ముందు 76 గంటల పాటు ప్రత్యేక చెక్ పోస్టుల దగ్గర ప్రతి వాహనం తనిఖీలు చేస్తామని, పోలీసులు, ఎన్నికల సిబ్బందికి ప్రజలు సహకరించాలని జిల్లా ఎస్పీ మణికంఠ మనవి చేశారు. ఓటు హక్కు లేకుండా జిల్లాలో ఎన్నికల ప్రచారం చెయ్యడానికి వచ్చిన వాళ్లు వెంటనే జిల్లా సరిహద్దులు దాటి వెళ్లిపోవాలని ఎస్పీ మణికంఠ సూచించారు.
చిత్తూరు జిల్లాలోని అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలు దింపుతున్నామని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ షన్మోహన్, జిల్లా ఎస్పీ మణికంఠ హెచ్చరించారు. మే 13వ తేదీ పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఏ పార్టీ జెండాలు, కండువాలు వేసుకుని ఎవ్వరూ తిరగకూడదని కలెక్టర్ సూచించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పుంగనూరు, చిత్తూరు. చంద్రగిరి, తిరుపతి, పీలేరు, తంబళపల్లె సమస్యాత్మక అసెంబ్లీ నియోజక వర్గాలు అని ఇప్పటికే ఎన్నికల అధికారులు గుర్తించారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications