చంద్రబాబు ఇలాకాలో వైసీపీలోకి టీడీపీ ముఖ్య నేతలు..!!
ఎన్నికల వేళ రాజకీయ లెక్కలు వేగంగా మారుతున్నాయి. ప్రత్యర్ధి పార్టీలను బలహీన పర్చే వ్యూహాలను అమలు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు టార్గెట్ గా పెద్దిరెడ్డి రాజకీయం చేస్తున్నారు. పెద్దిరెడ్డి కుటుంబం చిత్తూరు జిల్లాలో పార్టీ గెలుపు బాధ్యతలను తీసుకుంది. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న వేళ టీడీపీ ముఖ్య నేతలన తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలను ముమ్మరం చేసారు. అందులో భాగంగా కీలక నేతలు వైసీపీలో చేరేందుకు రంగం సిద్దమైంది.
టీడీపీకి షాక్
ఎన్నికల సమయంలో చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ తగిలిగింది. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సోదరుడు శ్రీనాథ్ రెడ్డి దంపతులు వైసీపీలో చేరనున్నారు. శ్రీనాథ్ రెడ్డి ఇంటికి స్వయంగా వెళ్లి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డివైసీపీలోకి ఆహ్వానించారు. ఈ నెల 25న సీఎం జగన్ సమక్షంలో త్వరలోనే శ్రీనాథ్ రెడ్డి దంపతులు వైసీపీలో చేరనున్నారు. గత ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డిపై టీడీపీ నుంచి శ్రీనాథ్ రెడ్డి భార్య అనిషారెడ్డి పోటీ చేశారు.

వైసీపీలోకి ఎంట్రీ
అనంతరం ఆమెను టీడీపీ పుంగనూరు ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పించారు. దీంతో అప్పటి నుంచి టీడీపీ కార్యక్రమాలకు శ్రీనాథ్ రెడ్డి, అనిషారెడ్డి దూరంగా ఉంటున్నారు. అమర్నాధ్ రెడ్డి 2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత టీడీపీలో చేరారు. మంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. అదే ఎన్నికల్లో పెద్దిరెడ్డి పైన పుంగనూరు నుంచి పోటీ చేసిన అనీషా రెడ్డికి 63,876 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో పెద్దిరెడ్డి 42,710 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి పుంగనూరు అభ్యర్దిగా చల్లా రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు.
మారుతున్న లెక్కలు
పెద్దిరెడ్డిని దెబ్బ తీయాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సమయంలోనే పెద్దిరెడ్డి నియోజకవర్గంలోని టీడీపీ మఖ్య నేతలను వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారు. పులివెందులలో జరిగే జగన్ సభలో వీరిద్దరూ వైసీపీ కండువా కప్పుకొనేందుకు ముహూర్తం ఖరారైంది. అమర్నాధ రెడ్డి చిత్తూరు టీడీపీలో కీలకంగా ఉన్నారు. ఇప్పుడు ఆయనకు షాక్ ఇస్తూ ఆయన తమ్ముడు, మరదలు నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.












Click it and Unblock the Notifications