సాయితేజ మృతదేహం గుర్తింపు- స్వస్థలానికి తరలింపు : ఆరుగురు డెడ్ బాడీల అప్పగింత...!!

ఆర్మీ చాపర్ ప్రమాదంలో మరణించిన రక్షణ సిబ్బందిలో మరో ఆరుగురిని అధికారులు గుర్తించారు. గుర్తించారు.హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన 13 మందిలో నలుగురు ఐఏఎఫ్, ఇద్దరు ఆర్మీ సిబ్బంది మృతదేహాలను గుర్తించి వారి బంధువులకు అప్పగించారు. జూనియర్ వారెంట్ ఆఫీసర్లు ప్రదీప్ అరక్కల్, రాణా ప్రతాప్ దాస్, వింగ్ కమాండర్ పృథ్వీ సింగ్ చౌహాన్, స్క్వాడ్రన్ లీడర్ కుల్దీప్ సింగ్, లాన్స్ నాయక్ బి సాయి తేజ,లాన్స్ నాయక్ వివేక్ కుమార్ ల మృతదేహాలను గుర్తించి వాటిని విమానాల్లో తరలిస్తున్నారు.

ఆరుగురి మృతదేహాల గుర్తింపు

ఆరుగురి మృతదేహాల గుర్తింపు

లాన్స్ నాయక్ బి సాయితేజ, లాన్స్ నాయక్ వివేక్ కుమార్ భౌతికకాయాలను శనివారం కుటుంబ సభ్యులకు అంద చేశారు.మిగిలిన సిబ్బంది భౌతికకాయాలను విమానంలో తరలించి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించే ముందు ఢిల్లీ కంటోన్మెంటులోని బేస్ హాస్పిటల్‌లో పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. ఏపీకి చెందిన సాయితేజ మృతదేహం మధ్నాహ్నం బెంగుళూరు విమానాశ్రం చేరుకుంటుంది. అక్కడి నుంచి వారి స్వగ్రామానికి వెళ్లనుంది.

సాయితేజ భౌతిక కాయం తరలింపు

సాయితేజ భౌతిక కాయం తరలింపు

చిత్తూరు జిల్లా కురబలకోట మండలం రేగడపల్లెకు చెందిన బి.సాయితేజ శరీరంపై ఉన్న పచ్చబొట్టు గుర్తుల ఆధారంగా అతడి భౌతిక కాయాన్ని గుర్తించారు. పచ్చబొట్ల వివరాలను, ఫొటోలను ఢిల్లీ సైనిక అధికారులకు వివరాలను సాయితేజ తండ్రి మోహన్‌ తెలిపారు.

సాయితేజ ఎడమ వైపు గుండె భాగంపై భార్య పేరు ఆంగ్లంలో శ్యామ అని, కుడిచేతి మీద త్రిశూలం ఆకారంలో శివుడిబొమ్మతో కూడిన పచ్చబొట్లు ఉన్నాయి. లాన్స్‌నాయక్‌ సాయితేజ భౌతికకాయాన్ని గుర్తించేందుకు అతడి తల్లిదండ్రులు భువనేశ్వరి, తండ్రి మోహన్, తమ్ముడు మహేష్‌బాబు, కుమారుడు మోక్షజ్ఞల నుంచి సేకరించిన రక్త నమూనాలను ఢిల్లీ తీసుకెళ్లారు.

Recommended Video

    Tirumala Ghat Road Damaged | Cyclone Jawad And AP Rains Update | AP Weather || Oneindia Telugu
    మధ్నాహ్నానికి స్వగ్రామానికి చేరిక

    మధ్నాహ్నానికి స్వగ్రామానికి చేరిక

    అందరి శ్యాంపిల్స్‌ సేకరణ పూర్తయ్యాక జెనెటిక్‌ ల్యాబ్స్‌లో డీఎన్‌ఏ పరీక్షలు జరిపి మృతదేహాన్ని అప్పగిస్తామని అధికారులు సాయితేజ కుటుంబ సభ్యులకు తెలిపారు. శనివారం ఉదయానికి ఈ ప్రక్రియ పూర్తి అయింది. ఆస్పత్రిలో పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించి.. మిలటరీ లాంఛనాలతో సాయితేజ స్వస్థలాలకు భౌతికకాయాన్ని తరలించారు. ఈ మధ్నాహ్నం తరువాత స్వగ్రామానికి సాయితేజ భౌతిక ఖాయం రానుంది. కుటుంబాన్ని ఓదార్చేందుకు, పరామర్శించేందుకు ప్రజలు, పార్టీలకు అతీతంగా నాయకులు తరలివస్తున్నారు.

    రేగడపల్లెలో ఉద్విగ్న వాతావరణం

    రేగడపల్లెలో ఉద్విగ్న వాతావరణం

    సాయితేజ మృతదేహం రాక కోసం రేగడపల్లె, కురబలకోట, బి.కొత్తకోట మండలాల్లోని పలు గ్రామాలు ఎదురు చూస్తున్నాయి. సాయితేజ గురించి తెలిసిన వాళ్లు, ముఖ్యంగా సైనిక ఎంపిక కోసం శిక్షణ పొందిన వారు విలపిస్తున్నారు. సాయితేజ ఇచ్చిన శిక్షణతో ఎంతోమంది సైనికులుగా ఎంపికయ్యారు. వారంతా అతడికి నివాళులర్పించేందుకు మృతదేహం కోసం నిరీక్షిస్తున్నారు. దీంతో రేగడపల్లెలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+