హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎస్వీ వర్సిటీలో అన్యమత ప్రచారం: పెయింటింగ్స్‌పై శిలువ గుర్తు, ప్రిన్సిపల్‌పై ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/చిత్తూరు: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో అన్యమత ప్రచారం జరుగుతోందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రిన్సిపల్ క్రిష్టోఫర్ దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ ఆయన పట్టించుకోవడం లేదని విమర్శించారు.

ఇటీవల అన్యమత ప్రచార గ్రంథాలు లభ్యమైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వేసిన కవులు, రచయితలు, నేతల పెయింటింగ్స్ పైన శిలువ గుర్తులు ఉన్నాయని విద్యార్థుల సంఘాలు వెల్లడించాయి. ఈ విషయమై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.

Christian activities in Tirumala's SV university

ప్రిన్సిపల్ క్రిష్టోఫర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు. క్రిష్టోఫర్ మద్దతుతోనే అన్యమత ప్రచారం జరుగుతోందని విమర్శించారు. కవులు, రచయితల పైన శిలువ పెయింటింగ్స్ ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఓ అన్యమతస్తుడిని ఇక్కడి విశ్వవిద్యాలయంలో ఎందుకు ఉంచారో చెప్పాలని విద్యార్థులు ప్రశ్నించారు.

ఉద్యోగాల పేరుతో టోకరా

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉద్యోగాల పేరిట టోకరా వేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరుద్యోగుల నుండి అతను రూ.2 కోట్లు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసులు నిందితుడుని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

English summary
Christian activities in Tirumala's SV university
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X