ఏపీ స్కూళ్లకు క్రిస్మస్ సంక్రాంతి సెలవులివే- ప్రభుత్వ ప్రకటన-ముఖ్యమైన తేదీలివే
ఏపీలో ప్రభుత్వ స్కూళ్లకు క్రిస్మస్, సంక్రాంతి సెలవుల్ని ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. రాష్ట్రంలో పాఠశాలలన్నీ ఈ సెలవుల్ని అమలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో క్రైస్తవ మిషనరీ స్కూళ్లకు క్రిస్మస్, మిగతా పాఠశాలలకు సంక్రాంతి సెలవులు అమలవుతాయని ప్రభుత్వం వెల్లడించింది.
రాష్ట్రంలోని పాఠశాలలకు ఈనెల 23 నుంచి క్రిస్మస్, జనవరి 10వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలోని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్‌సీఈఆఈర్టీ) అకడమిక్ క్యాలెండర్‌లో పొందుపరిచింది. క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 23 నుంచి 30వ తేదీ వరకు ఉంటాయి. క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయి.

డిసెంబర్ 31న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. ఇక సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 15వ తేదీ వరకు ఉంటాయని ఎస్‌సీఈఆర్టీ వివరించింది. మిషనరీ పాఠశాలలకు మినహా మిగిలిన పాఠశాలలకు ఈ సెలవులు వర్తిస్తాయి. జనవరి 17వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. జనవరి 8వ తేదీ రెండో శనివారం, 9వ తేదీ ఆదివారం కావడంతో ఆ రెండు రోజులూ సెలవులుగా ప్రకటించారు.
గతేడాది కోవిడ్ కారణంగా పాఠశాలలకు విద్యాసంవత్సరంలో పెనుమార్పులు చోటు చేసుకున్మాయి. ఈ ఏడాది కూడా కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా విద్యాసంవత్సరం ఆలస్యంగా మొదలైనా సెలవుల్లో మాత్రం పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. దీని ప్రకారం ఈ విద్యాసంవత్సరంలో క్లిస్మస్, సంక్రాంతి సెలవుల్ని నిర్ణయించారు. వీటిని రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు అమలు చేయాల్సి ఉంటుంది. కరోనా నేపథ్యంలో ఇప్పటికే పలు పాఠశాలలు ఇంకా ఆన్ లైన్ విధానంలోనే కొనసాగుతున్నాయి. వీరికి కూడా ఇవే సెలవులు వర్తించబోతున్నాయి.












Click it and Unblock the Notifications