సీఎం చంద్రబాబుకు సీఐ శంకరయ్య లీగల్ నోటీసులు - రూ 1.45 కోట్లు చెల్లించాలి..!!
ఒక సీఐ నేరుగా సీఎం కు నోటీసులు పంపారు. ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. పులివెందుల సీఐగా పని చేసిన సీఐ శంకరయ్య సీఎం చంద్రబాబుకు నోటీసులు పంపించారు. ఆ నోటీసుల్లో తన పరువు ప్రతిష్టకు భంగం కలిగిస్తూ మాట్లాడారంటూ.. అసెంబ్లీలో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. తనకు 1.45 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని పేర్కొన్నారు. వివేకా హత్య జరిగిన సమయంలో శంకరయ్య పులివెందుల సర్కిల్ ఇన్స్ పెక్టర్ గా పనిచేసారు.
ఒక పోలీసు అధికారి ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది. వివేకా హత్య కేసు సమయంలో పులివెందుల సీఐగా పని చేసిన శంకరయ్య ఇప్పుడు చంద్రబాబుకు నోటీసులు పంపారు. ఈ కేసులో తనపై నిరాధార ఆరోపణలు చేయడమే కాకుండా తన ప్రతిష్టకు భంగం కలిగించేలా చంద్రబాబు మాట్లాడారని, దీనికి తనకు 1.45 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని, అసెంబ్లీలో బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ చంద్రబాబుకు పంపిన లీగల్ నోటీసుల్లో శంకరయ్య పేర్కొన్నారు. తన న్యాయవాది ద్వారా ఈ లీగల్ నోటీసులను శంకరయ్య చంద్రబాబుకు పంపారు. వివేకా హత్య కేసు వ్యవహారంలో సీఐగా పని చేసిన శంకరయ్య పైన పలు ఆరోపణలు వచ్చాయి.

అప్పటి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. స్థానికంగా కొందరి ఒత్తిడి వల్ల తొలుత కేసులు నమోదు చేయకుండా.. ఘటన ప్రదేశాన్ని శుభ్రం చేయడం, ఆధారాల్ని మరుగున పర్చే విధంగా సీఐ వ్యవహరించారని ఆరోపణలు వినిపించాయి. శంకరయ్య ప్రస్తుతం కర్నూలు రేంజ్ లో వీఆర్ లో ఉన్నారు. వివేకా కేసులో చంద్రబాబు తనపై నిరాధర ఆరోపణలు చేశారని శంకరయ్య తన లాయర్ తో ఈ నెల 18న నోటీసులు పంపారు. కాగా, వివేకా హత్య తరువాత ప్రభుత్వం సీఐ శంకరయ్యను సస్పెండ్ చేసింది. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం 2021 అక్టోబర్ 6న సస్పెన్షన్ ను ఎత్తివేసింది. సీబీఐ విచారణ సమయంలోనూ శంకరయ్య తన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక, ఇప్పుడు ఈ కేసు సుప్రీంలో విచారణలో ఉంది. ఇప్పుడు సీఐ శంకరయ్య నేరుగా సీఎం చంద్రబాబుకు నోటీసులు పంపటంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది.












Click it and Unblock the Notifications