టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్ : అర్ద్రరాత్రి వేళ -ఆ కేసులో : చంద్రబాబు ఆగ్రహం..!!
టీడీపీ ఎమ్మెల్సీ ..ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు పరుచూరి అశోక్ బాబు అరెస్ట్ అయ్యారు. సీఐడీ పోలీసులు ఆయన్ను అర్ద్రరాత్రి అరెస్ట్ చేసారు. అశోక్ బాబు గురువారం రాత్రి ఒక వివాహానికి హాజరై పటమటలంకలోని తన నివాసానికి తిరిగి వచ్చారు. అప్పటికే వేచి చూస్తున్న సీఐడీ అధికారులు ఆయన రాగానే అదుపులోకి తీసుకున్నారు. పదోన్నతి కోసం నకిలీ విద్యార్హతలను చూపించారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. అశోక్ బాబు డిగ్రీ చదవక పోయినా చదివినట్లుగా నకిలీ సర్టిఫికెట్ సమర్పించారంటూ ఆయన పైన లోకాయుక్తలో ఫిర్యాదు అందింది.

నకిలీ సిర్టిఫికెట్ల కేసులో
అశోక్‌బాబు వాణిజ్య పన్నుల శాఖలో ఏసీటీవోగా పని చేసి రిటైర్ అయ్యారు. దీని పైన విచారించిన లోకాయుక్త వాణిజ్య పన్నుల శాఖ నుంచి నివేదిక తెప్పించుకుంది. సీఐడికి ఫిర్యాదు చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించింది.
దీంతో..తాజాగా అశోక్ బాబు పైన వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య అధికారులు సీఐడీకి ఫిర్యాదు చేసారు. దీంతో..అశోక్ బాబు పై 477 (A ), 466, 467, 468, 471,465,420, R/w34 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీఐడీ విచారణ ప్రారంభించింది. కాగా, గురువారం అర్ద్రరాత్రి అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్ పైన టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.

చంద్రబాబు ఆగ్రహం
అరెస్ట్ ను ఖండించారు. ఎపి ప్రభుత్వ తీరుపై టిడిపి అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పార్టీ నేత, ఎంఎల్ సి అశోక్ బాబు ను అరెస్టు చెయ్యడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు..సర్వీస్ మేటర్స్ లో తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారని ఆరోపించారు. అర్థ రాత్రి అరెస్టు చెయ్యాల్సిన అవసరం ఏమోచ్చిందని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీసినందునే అశోక్ బాబుపై ప్రభుత్వం కక్షగట్టిందని విమర్శించారు.

లోకాయుక్త సూచన మేరకు సీఐడీకి ఫిర్యాదు
జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుకు మూల్యం చెల్లిస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉద్యోగుల హక్కులపైన పోరాడుతున్నందునే అశోక్ బాబును అర్ద్రరాత్రి అరెస్ట్ చేసారంటూ లోకేష్ ఆరోపించారు. అశోక్ బాబు అరెస్ట్ పైన టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఐడీ అధికారులు అశోక్ బాబు అరెస్ట్ కు సంబంధించి ఈ రోజు అధికారికంగా సమాచారం ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications