చంద్రబాబు కేసులో సుప్రీంలో సీఐడీ మరో కీలక అడుగు..!!
టీడీపీ అధినేత చంద్రబాబు(Chandra Babu) కేసు కీలక మలుపులు తిరుగుతోంది. సుప్రీం(Supreme Court)లో ఒకే రోజు రెండు బెంచ్ ల వద్ద వాదనలు జరిగిన తరువాత అక్టోబర్ 3న విచారణకు నిర్ణయించారు. ఇదే సమయంలో సీఐడీ(CID) ఈ కేసులో మరో అడుగు వేసింది. సుప్రీంలో కేవియట్(Caveat) దాఖలు చేసంది. చంద్రబాబు పిటీషన్ పైన తమ వాదనలు వినకుండా నిర్ణయం తీసుకోవద్దని కోరింది. దీంతో, ఈ వ్యవహారంలో అక్టోబర్ 3న సుప్రీంలో విచారణ.. ఏ నిర్ణయం వెలువడుతుందనే దాని పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
సుప్రీంలో విచారణ : టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీం కోర్టు(Supreme Court)లో దాఖలు చేసిన ఎస్ఎల్పీ పైన అక్టోబర్ 3న విచారణ జరగనుంది. బుధవారం ముందుగా ఈ కేసు నిర్ణయించిన విధంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనంలోని న్యాయమూర్తి ఎస్‌వీఎన్ భట్టి బెంచ్ ముందు లిస్ట్ అయింది. అయితే, విచారణ సమయానికి తాను ఈ కేసు విచారణకు ఆసక్తిగా లేనని న్యాయమూర్తి భట్టి నాట్ బిఫోర్ మీ(not Before me) చెప్పారు.

దీంతో, మరో బెంచ్ కు బదిలీ చేస్తున్నట్లు వెల్లడిస్తూ వచ్చే వారం విచారణకు నిర్ణయించారు. ఆ వెంటనే చంద్రబాబు(Chandra Babu) న్యాయవాది సిద్దార్ధ లూద్రా సుప్రీం ప్రధాన ధర్మాసనం ముందుకెళ్లారు. సీజే ఆ సమయంలో లూధ్రాతో పాటుగా సీఐడీ(CID) న్యాయవాది నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
సుప్రీంలో కేవియట్ : చంద్రబాబు అరెస్ట్ సమయంలో అనుసరించిన విధానం.. పేర్కొన్న సెక్షన్లు..17ఏ అంశం ప్రస్తావనతో పాటుగా అసలు ఎఫ్ఐఆర్(FIR) లో పేరు లేకుండా అరెస్ట్ చేసారనే అంశాలను వివరించారు. దీని పైన సీఐడీ న్యాయవాది తన అభిప్రాయాలను వెల్లడించారు. ఏసీబీ కోర్టులో సీఐడీ కస్టడీకి కోరుతోందని..నిరోధించాలని లూధ్రా కోరారు. విచారణ కోర్టు కస్టడీ గురించి విచారించే సమయంలో తాము నియంత్రించలేమని చెప్పిన సీజే ఈ కేసును ప్రత్యేక బెంచ్ కు బదిలీ చేస్తామని..అక్టోబర్ 3న విచారణకు వస్తుందని వెల్లడించారు.
దీంతో, సీఐడీ(CID) ఈ కేసులో సుప్రీంలో కేవియట్ దాఖలు చేసింది. చంద్రబాబు దాఖలు చేసిన ఈ పిటీషన్ లో స్కిల్ కేసు(skill Cae)లో చంద్రబాబు పై నమోదైన ఎఫ్ఐఆర్ పైన స్టే ఇవ్వాలని..జ్యుడిషియల్ రిమాండ్ ను సస్పెండ్ చేయాలని..ప్రస్తుత విచారణ ప్రొసీజర్ జరుగుతుందో అది పూర్తిగా నిలిపివేయాలని
అభ్యర్దించారు.

విచారణపై ఉత్కంఠ : అక్టోబర్ 3న సుప్రీం కోర్టులో చంద్రబాబు(Chandra Babu) పిటీషన్ విచారణ ఏ బెంచ్ లో జరగనుందనేది లిస్టు కావాల్సి ఉంది. అయితే, ఆ రోజున అన్ని అంశాలను పూర్తిగా విచారించి నిర్ణయం తీసుకుంటారని సీజే చెప్పారు. ఇప్పుడు సీఐడీ కేవియట్ దాఖలు చేయటంతో..రెండు పక్షాల వాదనలు కోర్టు ముందు వినిపించనున్నారు. ఇదే సమయంలో ఏసీబీ కోర్టు(ACB Court)లో చంద్రబాబు కస్టడీ..బెయిల్ పిటీషన్ల పైన అక్టోబర్ 4న ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.
సుప్రీంలో జరిగే విచారణ...నిర్ణయం ఆధారంగా ఏసీబీ కోర్టులో విచారణ విషయంలో నిర్ణయం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక, చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ల పైన ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. లోకేశ్(lokesh) బెయిల్ పిటీషన్ పైన శుక్రవారం విచారణ జరగనుంది.












Click it and Unblock the Notifications