ఎన్నికల వేళ బిగ్ ట్విస్ట్ - చంద్రబాబు, లోకేష్ పై సీఐడీ కేసు..!!

ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ పైన సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ల్యాండ్ టైటిల్ యాక్టు పైన తప్పుడు ప్రచారం పై ఎన్నికల సంఘం ఆదేశాల మరకు సీఐడీ కేసు నమోదు చేసింది. అందులో భాగంగా చంద్రబాబు ఏ1, నారా లోకేష్ ఏ2 గా ఎఫ్ఐఆర్ లో చేర్చింది. ల్యాండ్ టైటిలింగ్ చట్టం పై ఐ వి ఆర్ ఎస్ కాల్స్ తో తప్పుడు ప్రచారం చేసిన టీడీపీ పైన చర్యలు చేపట్టింది.ఈసీ ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ నమోదు అయింది.

సీఐడీ విచారణ
ల్యాండ్ టైటిల్ యాక్టు వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం పైన టీడీపీ దుష్ఫ్రచారం చేస్తందని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. దీని పైన స్పందించిన ఈసీ చర్యలకు ఆదేశించింది. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో పేదల భూములు లాక్కుంటారని విష ప్రచారం చేస్తున్నారని.. ఐవీఆర్ ఎస్ కాల్స్ ద్వారా త‌ప్పుడు ప్రచారం చేస్తున్నార‌ని ఈసీకి ఫిర్యాదు చేశారు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్‎తో తయారు చేసి అన్ని రాష్ట్రాలకు పంపిందని, దేశంలోఉన్న భూ విబేధాలు తగ్గించాలని కేంద్రం నిర్ణయించిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

CID Registered FIR in Land title act fake propoganda against Chandra Babu and Lokesh

ప్రచారం వెనుక
ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ ముందు భూ సర్వే జరపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఈ ఫిర్యాదులో పొందుపరిచారు. సరిహద్దు తగాదాలు వల్ల ఇబ్బందులు వస్తున్నాయని వాటిని పరిష్కరించేందుకు కేంద్ర ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. డిజిటలైజేషన్ పద్ధతిలో రికార్డులు కూడా ఇచ్చారు. సమగ్ర భూ సర్వే పూర్తి అయిన తర్వాత మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తాం అని ప్రభుత్వం చెబుతోందని వెల్లడించారు. కానీ ప్రతిపక్షాలు ఇవన్నీ పట్టనట్లు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‎పై చేస్తున్న విష ప్రచారాన్ని ఆధారాల‌తో స‌హా ఈసీకి ఫిర్యాదు చేశారు.

చర్యలు ప్రారంభం
దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నిక‌ల కోడ్‎కు విరుద్దంగా టీడీపీ ప్రచారం చేస్తున్నట్లు గుర్తించిన ఈసీ.. వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై చ‌ర్యలు తీసుకోవాల్సిందిగా సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ చంద్రబాబు, లోకేష్ తో సహా పది మంది పేర్లను ఎఫ్ఐఆర్ లో నమోదు చేసింది. ఐవీఆర్ఎస్ కాల్స్ చేసిన ఏజెన్సీ పైన కేసు రిజిస్టర్ అయింది. విచారణ ప్రారంభించిన సీఐడీ ఈ ప్రచారం చేసిన సంస్థలు, వ్యక్తుల గురించి ఆరా తీస్తోంది. విచారణ గురించి ఎన్నికల సంఘానికి సీఐడీ నివేదిక ఇవ్వనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+