Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విశాఖ సదస్సు హిట్: బెజవాడలో కన్వెన్షన్ సెంటర్, కేంద్రం వరాలు (పిక్చర్స్)

విశాఖ: విజయవాడలో అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ఫార్చూన్ హోటల్ యాజమాన్యం మంగళవారం రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దీనికి సంబంధించి ఆ హోటల్ అధినేత ముత్తవరపు మురళీకృష్ణ మాట్లాడుతూ.. నాలుగువేల సీటింగ్ సామర్థ్యంతో, 50వేల చ.అ. విస్తీర్ణంలో ఈ సెంటర్ నిర్మిస్తామన్నారు.

విశాఖలో భాగస్వామ్య పెట్టుబడులో పెట్టుబడులు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఏపీకి కేంద్ర ప్రభుత్వం కూడా అనూహ్యమైన వరాలు ప్రకటించింది. మూడో రోజైన మంగళవారం నాడు కేంద్రమంత్రి అనంత్ కుమార్.. ఢిల్లీ నుంచి ఏపీ కోసం చల్లని ప్రగతి సందేశాలు తీసుకు వచ్చారు.

కో ఆపరేటివ్ ఫెడలిరిజాన్ని ప్రధాని మోడీ విశ్వసిస్తున్నారని, అందులో భాగంగా ఏపీ సర్వతోముఖాభివృద్ధి కోసం అనేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని అనంత్ కుమార్ చెప్పారు. విశాఖ పట్టణాన్ని ఫార్మా హబ్‌గా మారుస్తామన్నారు.

అందుకు విశాఖలో రూ.600 కోట్ల పెట్టుబడితో జాతీయ ఫార్మాస్యూటికల్స్ విద్య, పరిశోధన సంస్థ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దీనివల్ల ఫార్మా పరిశ్రమకు అవసరమైన నిపుణులు అందుబాటులోకి వస్తారన్నారు. హిందుస్తాన్ పెట్రోలియం రిఫైనరీని రూ.30వేల కోట్ల పెట్టుబడితో విస్తరించనున్నట్లు ఆనంత కుమార్ తెలిపారు.

విశాఖ - కాకినాడ మధ్య ఉన్న పెట్రో కెమికల్ కారిడార్లను పెట్రో కెమికల్ కాంప్లెక్సుగా అభివృద్ధి చేస్తామన్నారు. స్కిల్ ఇండియా స్కీం కింద బెజవాడలో పని చేస్తున్న ప్లాస్టిక్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కేంద్ర సంస్థ హోదాను పెంచనున్నట్లు అనంత్ కుమార్ చెప్పారు. విశాఖలో వైద్య పరికరాల తయారీ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు.

విశాఖ సదస్సు

విశాఖ సదస్సు

భాగస్వామ్య సదస్సు విజయవంతమైంది. ప్రభుత్వమే రూ.2 లక్షల కోట్ల ఒప్పందాలు కుదరవచ్చని భావించగా అనూహ్యంగా రూ.4,76,878 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదరడంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో ఆనందం వెల్లివిరుస్తోంది.

 విశాఖ సదస్సు

విశాఖ సదస్సు

తద్వారా కొత్తగా 10 లక్షలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. భాగస్వామ్య సదస్సు చివరి రోజున ఆతిథ్యం, హోటళ్ల రంగాలకు చెందిన సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకుంది.

విశాఖ సదస్సు

విశాఖ సదస్సు


రూ.2,500 కోట్ల పెట్టుబడితో ఏపీలో 100 హోటళ్లు, 15 హాస్పిటాలిటీ ట్రెయినింగ్‌ అకాడమీలను నెలకొల్పేందుకు బ్రిటన్‌కు చెందిన ఆదిత్యా రాయ్‌ సారథ్యంలోని ఐవరీశాండ్స్‌ గ్రూపు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.

 విశాఖ సదస్సు

విశాఖ సదస్సు

ఇంకా వైకేఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌, స్టార్‌వుడ్స్‌ అండ్‌ ఎన్‌ఏసీ హాస్పిటాలిటీ, ఇంటర్‌గ్లోబ్‌ హోటల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, క్యాజిల్‌హిల్స్‌ ప్రాజెక్స్‌ ఇండియా- జంపెర్ల ఎస్‌పీఏ, ఇటలీ, విజయ్‌ సిద్ధార్ధ హోటళ్లు తదితర పలు సంస్థలకు సంబంధించిన పెట్టుబడుల ప్రతిపాదనలపై ఒప్పందాలు కుదిరాయి.

 విశాఖ సదస్సు

విశాఖ సదస్సు

ఏపీలో కొత్తగా మూడు విమానాశ్రయాలు రానున్నాయి. ఒక గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖపట్నంలో ఏర్పాటు కానుంది. మరో రెండు నెల్లూరు, కర్నూలులో ప్రతిపాదించారు. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు వెల్లడించారు.

 విశాఖ సదస్సు

విశాఖ సదస్సు

రాష్ట్రంలోని 3 జిల్లాల్లో షాపింగ్‌ మాల్‌లను నిర్మించనున్నట్లు సీఎంఆర్‌, ఎంవీఆర్‌ గ్రూప్‌ల అధినేత వెంకటరమణ తెలిపారు. ప్రభుత్వంతో ఈమేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

విశాఖ సదస్సు

విశాఖ సదస్సు


విశాఖ జిల్లా అచ్యుతాపురంలోని ప్రత్యేక ఆర్థిక మండలిలో రూ.3 వేల కోట్లతో నిర్మించనున్న చైనాకు చెందిన ట్రినా సోలార్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ సోమవారమే ఒప్పందం కుదుర్చుకొని మంగళవారం భూమిపూజ చేయడం అభినందనీయమని ఏపీఐఐసీ ఛైర్మన్‌ కృష్ణయ్య తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+