వైసీపీ నుంచి ఎన్నికల బరిలో డైరెక్టర్ వినాయక్ - నియోజకవర్గం ఫిక్స్..!!
ఏపీలో ఎన్నికల రాజకీయంలో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. వైసీపీలో ఇంఛార్జ్ ల మార్పు వ్యవహారం సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెంచుతోంది. టీడీపీ, జనసేన తమ తొలి అభ్యర్దుల జాబితా సంక్రాంతి కి విడుదల చేయాలని భావిస్తోంది. ఈ రెండు పార్టీలతో బీజేపీ కలిసి వస్తుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో వైసీపీలో పలువురు ప్రముఖుల చేరికకు రంగం సిద్దం అవుతోంది. ఈ జాబితా లో స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ ఉన్నారు.
ఎన్నికల బరిలోకి వినాయక్:ముఖ్యమంత్రి కొత్త వ్యూహాలతో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. టీడీపీ, జనసేన పొత్తు వేళ గోదావరి జిల్లాల్లో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కొత్త నేతల చేరికల దిశగా కసరత్తు వేగవంతం చేసారు. ఇప్పటికే కాపు ఉద్యమ నేత ముద్రగడ వైసీపీలో చేరటం ఖాయమైంది. తాజాగా స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ వైసీపీలో చేరటానికి ముహూర్తం ఫిక్స్ అయింది. వినాయక్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా బరిలోకి దిగనున్నారు. వినాయక్‌ది పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు. రాజకీయాల్లో అంటే ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. జగన్ నాయకత్వాన్ని పలు సందర్భాల్లో ఆయన ప్రశంసించారు. వీవీ వినాయక్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీకి అత్యంత సన్నిహితుడిగా పేరుంది.

ఎంపీగా పోటీకి ఛాన్స్:వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ భీమవరం, లేదా కాకినాడ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ సమయంలో పవన్ పైన వైసీపీ తమ అభ్యర్దిని సిద్దం చేస్తోంది. ఈ రోజు లేదా రేపు వినాయక్ అధికారికంగా వైసీపీలో చేరనున్నారు. కాకినాడ లేదా ఏలూరు ఎంపీ బరిలో వీవీ వినాయక్ ను దింపాలని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు జరుగుతున్న కసరత్తుల్లో భాగంగా వినాయక్ పేరును వైసీపీ అధిష్టానం పరిశీలిస్తోంది.
సంక్రాంతిలోపే ఇంఛార్జిగా ప్రకటించి ప్రజల్లోకి పంపాలని వైసీపీ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం స్థాపన సమయంలోనే వినాయక్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం సాగింది. 2014 ఎన్నికల్లోనే నిడదవోలు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ తరపున పోటీ చేస్తారని ప్రచారం జరిగింది.
జగన్ కొత్త లెక్కలు:ఇక, ఇప్పుడు ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో ప్రతీ సీటు జగన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. ఏలూరు నుంచి ఎంపీ కోటగిరి శ్రీధర్ తాను పోటీ చేయనని అధిష్టానానికి చెప్పారు. ఈ మధ్యనే స్వగ్రామం తాడిపూడిలో ఆయన పర్యటించగా.. వైసీపీ నేతలు ఘన స్వాగం పలకడం, ర్యాలీలు నిర్వహించడం.. ప్రత్యేకంగా భేటీ కావడంతో ఇదంతా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికేననే సంకేతాలుగా భావించారు. తూర్పు గోదావరిలో ముద్రగడ..పశ్చిమ గోదావరిలో వీవీ వినాయక్ తో జగన్ ఈ సారి ఎన్నికల్లో కొత్త లెక్కలతో బరిలోకి దిగుతున్నారు. పార్టీలో చేరటం..సీటు పైన వినాయక్ అధికారికంగా స్పందించలేదు. ఒకటి రెండు రోజుల్లోనే దీని పైన అధికారికంగా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications