టార్గెట్ రోజా..ఆ ఇద్ద‌రు హీరోయిన్లు తేల్చేసారు: స‌్వ‌తంత్రగా అయినా న‌గ‌రిలోనే: త‌ట్టుకోగ‌ల‌రా..!

Recommended Video

    న‌గ‌రిలో రోజాకు పోటీగా ఇద్ద‌రు హీరోయిన్లు || Vani Viswanath And Priya Raman Concentrated On Nagari

    వైసీపీ ఫైర్ బ్రాండ్ ఇప్పుడు టీడీపీకే కాదు..బీజేపీకి టార్గెట్ అయ్యారు. కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డి రెండు నెలలు కాలేదు. అప్పుడే అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన రోజా ల‌క్ష్యంగా రాజ‌కీయాలు చేస్తున్నారు. ఇందులో టీడీపీ నుండి హ‌డావుడి చేయ‌టానికి ఒక హీరోయిన్ రెడీ అవుతుంటే..బీజేపీ ముఖ్య నేత‌లు స్వ‌యంగా మ‌రో వెట‌ర‌న్ హీరోయిన్‌ను రంగంలోకి దిగాల‌ని ఇప్ప‌టికే సూచించారు. అయితే, ఆ రెండు పార్టీల నుండి రోజా పైన రాజ‌కీయ దాడికి సిద్ద‌మ‌వుతున్న ఇద్ద‌రిదీ మ‌రో రాష్ట్ర నేప‌థ్య‌మే. అస‌లు..రోజా మీద ఎందుకు ఆ రెండు పార్టీలు దృష్టి పెట్టాయి. న‌గ‌రిలో రోజాను ఎదుర్కోవ‌టం సులువైన విష‌య‌మేనా..రోజా చెబుతున్న స‌మాధానం ఏంటి..

    వాణీ విశ్వ‌నాధ్ కీల‌క వ్యాఖ్య‌లు..రోజాపై ఖ‌చ్చితంగా..

    వాణీ విశ్వ‌నాధ్ కీల‌క వ్యాఖ్య‌లు..రోజాపై ఖ‌చ్చితంగా..

    చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఎన్నిక‌ల ఏడాదిలో వెట‌రన్ హీరోయిన్ వాణీ విశ్వ‌నాధ్ పేరు చాలా అనూహ్యంగా తెర మీద‌కు వ‌చ్చింది. అమ‌రావ‌తి వ‌చ్చి చంద్ర‌బాబుతో సైతం భేటీ అయ్యారు.ఆ స‌మ‌యంలో న‌గ‌రి నుండి వాణీ విశ్వ‌నాధ్ టీడీపీ అభ్య‌ర్దిగా రోజా మీద పోటీ చేస్తార‌నే ప్ర‌చార‌మూ సాగింది. అయితే, న‌గ‌రిలో గాలి ముద్దుమ కృష్ట‌మ నాయుడు మ‌ర‌ణంతో సింప‌థీ ఏర్ప‌డ‌టంతో ఆ కుటుంబానికే చంద్ర‌బాబు అవ‌కాశం ఇవ్వాల్సి వ‌చ్చింది. ఇక‌, ఇప్పుడు ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్ప‌డింది. తాజాగా వాణీ విశ్వ‌నాద్ స‌న్నిహితులు ఒక వార్తా సంస్థ‌తో చెప్పిన స‌మా చారం ప్ర‌కారం త్వ‌ర‌లోనే వాణీ విశ్వ‌నాద్ మ‌రోసారి చంద్ర‌బాబును క‌ల‌వ‌బోతున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఈ సారి టీడీపీ నుండి న‌గ‌రి అభ్య‌ర్దిగా పోటీ చేస్తాన‌ని..టీడీపీ కాదంటే స్వ‌తంత్ర అభ్య‌ర్దిగా అయిన స‌రే రోజా మీద పోటీ చేసి తీరుతాన‌ని వాణీ విశ్వ‌నాద్ స్పష్టం చేస్తున్నార‌ని చెబుతున్నారు. అస‌లు రోజా మీద ఎందుకింత వాణీ విశ్వ‌నాద్ టార్గెట్ చేస్తున్నార‌నేదే ఇప్పుడు చ‌ర్చ‌...

    బీజేపీ నుండి ప్రియారామ‌న్‌ సైతం...

    బీజేపీ నుండి ప్రియారామ‌న్‌ సైతం...

    ఇక‌, తాజాగా మ‌రో వెట‌ర‌న్ హీరోయిన్ ప్రియారామ‌న్ బీజేపీలో చేరారు. కేర‌ళ స్వ‌స్థ‌లం అయినా ఏపీలో ప్రియా రామన్ సేవ‌లు వినియోగించుకోవాల‌ని బీజేపీ డిసైడ్ అయింది. అందులో భాగంగా..చిత్తూరు జిల్లా పైన దృష్టి పెట్టాల‌ని సూ చించిన‌ట్లు స‌మాచారం. అందునా ఇప్ప‌టికే వైసీపీ నుండి రెండు సార్లు న‌గ‌రి నుండి గెలిచిన రోజా సైతం సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన వారే కావ‌టంతో పాటుగా..నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీలో ఉన్న గ్రూపులు ఈ సారి రోజా పోటీ చేసినా స‌హ‌క‌రించే ప‌రిస్థితిలో లేవ‌ని బీజేపీ నేత‌లు ప్రచారం చేస్తున్నారు. ప్రియా రామ‌న్‌ను రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పటిష్ట‌త కోసం వినియోగించుకుంటూనే..వ‌చ్చే ఎన్నిక‌ల్లో న‌గ‌రి నుండి బ‌రిలోకి దింపే యోచ‌న‌లో ఉంది. ప్రియా రామన్ మాత్రం రోజా మీద త‌న‌కు ఎటువంటి వ్య‌తిరేక‌త లేద‌ని.. గౌర‌వం ఉంద‌ని వ్యాఖ్యానించారు. అయితే, రాజ‌కీయంగా మ‌రి పార్టీ అదేశిస్తే న‌గ‌రి నుండి బ‌రిలో దిగ‌టానికి సిద్ద‌మనే సంకేతాలు ఇస్తున్నారు.

    ఫైర్ బ్రాండ్‌ను ఎదుర్కోగ‌ల‌రా..

    ఫైర్ బ్రాండ్‌ను ఎదుర్కోగ‌ల‌రా..

    టీడీపీ నుండి ఒక‌రు..బీజ‌పీ నుండి మ‌రొక‌రు సినీ గ్లామ‌ర్ ఉన్న ఆ ఇద్ద‌రూ రోజా మీద పోటీ చేయాల‌ని ఆశిస్తున్నారు. టీడీపీ నుండి సీటు రాక‌పోతే స్వ‌తంత్ర అభ్య‌ర్దిగా అయినా బ‌రిలోకి దిగుతామ‌ని చెబుతున్నారు. అయితే, అస‌లు న‌గ‌రి లో రోజాను రాజ‌కీయంగా ఎదుర్కోవ‌టం కొత్త‌గా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఈ ఇద్ద‌రికీ సాధ్య‌మేనా అనే చ‌ర్చ సాగుతోంది. రోజా సీనీ హీరోయిన్‌గా కంటే టీడీపీలో సుదీర్ఘ కాలం ప‌ని చేసిన అనుభ‌వం.. వైసీపీలో ఫైర్ బ్రాండ్‌గా వ‌చ్చిన క్రేజ్ రెండో సారి ఎమ్మెల్యేగా గెలిపించాయి. పార్టీ అధికారంలోకి రావ‌టంతో త‌న నియోజ‌క‌వ‌ర్గం మీద ప్ర‌త్యేక దృష్టి సారించి త‌న ప‌ట్టు నిలుపుకోవాల‌ని రోజా భావిస్తున్నారు. ఇంకా ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఉన్నా..ఇప్ప‌టికే రోజా మీద పోటీకి ఈ ఇద్ద‌రు సిద్ద‌మ‌నే ప్ర‌చారం మాత్రం జోరుగా సాగుతోంది. రోజా మాత్రం ఎవ‌రు త‌న మీద పోటీ చేసినా..న‌గ‌రి ప్ర‌జ‌లు మాత్రం త‌న‌తోనే అంటూ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+