గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీజేఐ ఎన్వీ రమణ కెరీర్ లో మరో కీలక ఘట్టం - కొత్త రికార్డు : కీలక సూచనలు..!!

|
Google Oneindia TeluguNews

సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి మరో గౌరవం దక్కింది. సీజేఐ హోదాలో ఉన్న ఎన్వీ రమణకు ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. ఇప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. యూనివర్సిటీ ఛాన్సలర్ హోదాలో గవర్నర్ బిశ్వ భూషణ్ డాక్టరేట్ ను సీజేఐకు ప్రధానం చేసారు. ఈ నెల 27న పదవీ విరమణ చేయనున్న ఎన్వీ రమణ అధికారిక హోదాలో ఈ పట్టా అందుకున్నారు. దీంతో..రెండు డాక్టరేట్లు అందుకున్న సీజేఐ గా రమణ నిలిచారు. తాను చదివిన యూనివర్సిటీలోనే డాక్టరేట్ తీసుకోవటం పట్లు సీజేఐ సంతోషం వ్యక్తం చేశారు.

యూనివర్సిటీలో నాయకుడిగా

యూనివర్సిటీలో నాయకుడిగా


ఆచార్య నాగార్జున సిద్ధాంతాలకు లోబడి యూనివర్సిటీ ముందుకెళ్తుందన్నారు. ప్రపంచాన్ని మార్చడానికి విద్య అనేది మంచి ఆయుధంగా పేర్కొన్నారు. విద్యులో అందరికీ సమాన విద్యావకాశాలు కల్పించాలని అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 22 A ప్రకారం 16 ఏళ్ల లోపు అందరికి నిర్బంధ విద్య అమలు చేయాలని గుర్తు చేసారు. ఈ మధ్య కాలంలో చరిత్ర..ఆర్దిక శాస్త్రం...మానవశాస్త్రం పైన నిర్లక్ష్యం చూపుతున్నారని చెప్పుకొచ్చారు. తాను యూనివర్సిటీలో నాయకుడిగా పని చేసానని చెబుతూ..నాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు.

తరగతుల్లో కాదు,,. క్యాంటీన్ లోనే

తరగతుల్లో కాదు,,. క్యాంటీన్ లోనే


తన ఇంటి మందు ధర్నా చేసి..ఇదే యూనివర్సిటీలో చదవాలని డిమాండ్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. తాను ఇదే విశ్వ విద్యాలయంలో లా చదువుకున్నానని వివరించారు. తాను చదువుకొనే సమయంలో తరగతి గదిలో కంటే క్యాంటీన్ లోనే ఎక్కువగా ఉండేవాడినని వివరించారు. క్యాంటీన్ వేదికగానే అనేక అంశాల పైన చర్చలు చేసే వారమని చెప్పారు. ఆ రోజుల్లో ఉన్న చైతన్యం,సామాజిక స్పృహ ఇప్పుడు లేకపోవడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. యూనివర్సిటీల్లో సమస్యలపై చర్చ జరగకపోతే యువతరం పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సంస్కృతి,భాష పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.

ఇదే తొలిసారంటూ మంత్రి బొత్సా

ఇదే తొలిసారంటూ మంత్రి బొత్సా


అవినీతిని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించవద్దని సీజేఐ సూచించారు. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు గౌరవ పట్టా ఇవ్వడం అద్భుతమైన ఘట్టంగా మంత్రి బొత్సా అభివర్ణించారు. నాగార్జున యూనివర్శిటీలో చదివి.. అదే యూనివర్శిటీలో గౌరవ డాక్టరేట్ పొందడం ఇదే తొలిసారని చెప్పారు. విద్యే సంపద అని రాష్ట్ర ప్రభుత్వం నమ్మకంగా పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం నూతన విద్యా విధానం అమలు చేస్తోందన్నారు. విద్యా శాఖలో గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో పెంచే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. మెరుగైన విద్యను అందించడమే జగన్ ప్రభుత్వం లక్ష్యంగా వెల్లడించారు. గౌరవ డాక్టరేట్ తీసుకోవడం జస్టిస్ ఎన్వీ రమణకు గర్వ కారణం కాదు.. యావత్ రాష్ట్ర ప్రజానీకానికే గర్వ కారణగా బొత్సా పేర్కొన్నారు.

English summary
Acharya Nagarjuna University hounured CJI NV Ramana With Docatorate today. Governor presented the Doctorate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X