తిరుపతి - చెన్నై టోల్ గేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం..!!
తిరుపతి జిల్లా వడమాల పేట టోల్ గేట్ వద్ద వివాదం చోటు చేసుకుంది. తమిళనాడు లా కళాకాళ విద్యార్దులు - టోల్ గేట్ సిబ్బంది మధ్య చోటు చేసుకున్న వివాదం పెద్దదైంది. వాహనాల ధంసం వరకు వెళ్లింది. తమిళనాడుకు చెందిన లా కళాశాల విద్యార్దులు 70 మంది తిరుపతిలో పరీక్షలు రాస్తున్నారు. శనివారం పరీక్షకు చివరి రోజు కావటంతో పరీక్ష రాసిన విద్యార్ధులు తిరిగి వెళ్లే సమయంలో వడమాటపేల టోల్ ప్లాజా వద్ద రుసుము చెల్లించే విషయంలో వివాదం మొదలైంది.
రుసుము చెల్లించటానికి ఆ విద్యర్ది ఫాస్ట్ టాగ్ లో సరిపడా డబ్బులు లేవు. దీంతో వాహనం వెనక్కు తీసి మిగిలిన వాహనాలను అవకాశం ఇవ్వాలని సూచించారు.దీంతో మాట మాట పెరిగి విద్యార్ది ముందుగా హెల్మెట్ తో టోల్ సిబ్బంది పైన దాడి చేసారు. టోల్ ప్లాజా సిబ్బంది విద్యార్దుల వాహనాల పైన దాడి చేసారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు అక్కడకు చేరుకొని రెండు వైపు సర్దిచెప్పారు. అయితే, విద్యార్దులు సరిహద్దులో ఏపీ వాహనాలను అడ్డుకొనే ప్రయత్నం చేయటం తో ఈ వివాదం కొత్త టర్న్ తీసుకుంది.

రెండు వైపుల నుంచి పోలీసులు సకాలంలో జోక్యం చేసుకోవటంలో వివాదం పూర్తిగా సమిసిపోయింది. వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేదని పోలీసులు స్పష్టం చేసారు. వాహనాలను ఆపి నిరసన తెలిపేందుకు తమిళనాడు లా విద్యార్ధుల అసోసియేషన్ ప్రయత్నించాన..పోలసులు వారించారు. విద్యార్దులు - టోల్ సిబ్బంది ఇద్దరి నుంచి తప్పు ఉందని, ప్రస్తుతం వివాదం లేదని పోలీసులు వెల్లడించారు.
తిరుపతి చెన్నై టోల్ గేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం pic.twitter.com/L9XCuXZdco
— oneindiatelugu (@oneindiatelugu) October 23, 2022












Click it and Unblock the Notifications