బైక్‌ను తగిలిన కారు: కృష్ణా జిల్లాలో టీడీపీ-వైసీపీ మధ్య ఘర్షణ
విజయవాడ: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తెల్లప్రోలు గ్రామంలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య గురువారం ఉదయం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి.
తెలుగు యువత నాయకులు, గ్రామ సర్పంచ్ భర్త భీమవరపు జితేంద్ర రామకృష్ణ తన కారులో గ్రామంలోకి వస్తున్నారు. ఆ సమయంలో బైక్ పైన వైసీపీ నాయకుడు వెంకట రెడ్డి వెళ్తున్నారు.

టీడీపీ నేత కారు వైసీపీ నేత బైక్‌కు తగిలింది. ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు.
దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు సంఘటన స్ధలానికి చేరుకుని ఇరువర్గాలను అదుపు చేశారు. సర్పంచ్ భర్తపై ఉంగుటూరు పోలీస్ స్టేషన్‌లో వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications