తిరుమల వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీవారిని దర్శించుకున్నారు. తాను నేనూ ఏ సంకల్పం తీసుకున్న ముందు శ్రీవారిని దర్శించుకుంటానని చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఇంతటి విజయాన్ని తాను ఎప్పుడూ చూడలేదన్నారు. రాష్ట్రంలో ప్రజా పాలన మొదలైందని..టీటీడీ నుంచే ప్రక్షాళన జరగాలని ప్రకటించారు. తాను అందరి వాడినని చంద్రబాబు వెల్లడించారు. దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా శ్రీవారి ఆలయాలు నిర్మించే విధంగా ముందుకు వెళ్తామని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
తిరుమలలో చంద్రబాబు
కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు శ్రీవారిని దర్శించుకున్నారు. గతంలో తనపై క్లోమోర్ దాడి జరిగినప్పుడు స్వామివారే నన్ను రక్షించారని చెప్పారు. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఆర్థిక అసమానతల తొలిగిపోవాలన్నారు. ఇప్పుడూ సంపద సృష్టించడమే కాదు అది పేదలకు అందించడంమే తన ప్రదాన లక్ష్యంగా పేర్కొన్నారు. తన మనవడు దేవన్ష్ పుట్టిన రోజునుండి అన్నదానం కోసం విరాళం ఇస్తున్నట్లు గుర్తు చేసారు. పేదరికం లేని సమాజం కోసం నిత్యం పనిచేస్తానని చెప్పారు. మంచివారిని కాపాడుకోవాలి, చెద్దవారిని శిక్షించాలని వ్యాఖ్యానించారు.

ప్రక్షాళన షురూ
రాష్ట్రంలో పరదాలు కట్టే అలవాటు (సంస్కృతి) ఇంకా పోలేదున్నారు. దేశ రాజకీయాల్లో ఏపి కీలక పాత్ర పోషించే అవకాశం దక్కిందని చెప్పుకొచ్చారు. తాను గంటల తరబడి పూజలను చేయనని..ఒక్క నిమిషం మాత్రమే ధ్యానం చేస్తానన్నారు. తాను జైలులో ఉన్నప్పుడు తనను ఆదుకున్నది కుటుంబ వ్యవస్థనేనని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తిరువళ్ళ శనివారాల్లో ఉపవాసం వుండి స్వామి వారికీ పూజలు చేస్తామన్నారు.టీటీడీతోనే ప్రక్షాళన ప్రారంభం అవ్వాలని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. టీటీడీలో పెద్ద ఎత్తున్న అవకతవకలు జరిగాయన్నారు. జనాలనూ నా దగ్గరకు రానివ్వకుండా కర్ఫ్యు వాతావరణం సృష్టించారని చెప్పుకొచ్చారు.
అందరి వాడిని
తన కుటుంబానికి నేను ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. 30 ఏళ్ల క్రితమే వాళ్ళకి వ్యాపారం పెట్టించా. " శ్రీవారి సమక్షంలో చెబుతున్నా.. నేను 5కోట్ల ప్రజల మనిషిని. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ 5 ఏళ్ళు ఎంతో ఇబ్బంది పడ్డారు. రాష్ట్రంలో ఉద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారు.' అని అన్నారు. తిరుమలని ప్రక్షాళన చేస్తా. దేశం గర్వపడేలా ప్రక్షాళన జరుగుతుందని చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఒక చారిత్రాత్మక తీర్పును ప్రజలు తమకు ఇచ్చారన్నారు. నేటి నుంచి ప్రజాపాలన మొదలైందని చెప్పారు. ఇకపై 4.0 పాలన ఎలా ఉండబోతుందో మీరే చూస్తారు అంటూ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
-
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు!












Click it and Unblock the Notifications