పవన్ కు కీలక శాఖల ఖరారు, ఏరి కోరి - మంత్రులకు ఇలా..!!
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు..24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసారు. మూడు పార్టీల కూటమి నుంచి మంత్రులు భాగస్వాములుగా ఉన్నారు. సుదీర్ఘ కసరత్తు తరువాత చంద్రబాబు తన మంత్రివర్గంలోని జనసేన మంత్రులకులకు శాఖలు ఖరారు చేసారు. రాష్ట్ర మంత్రివర్గంలో పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో వ్యవహరించనున్నారు. పవన్ కల్యాణ్ కు చంద్రబాబు కీలక శాఖలను కేటాయించారు.
మంత్రుల శాఖలు
ఈ సారి తన కేబినెట్ లో మహిళలు- బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు. సామాజిక సమీకరణాల ఆధారంగా తుది కేబినెట్ ను ప్రకటించారు. సీనియర్లు పలువురికి బెర్తులు దక్కలేదు. ఇక..కేబినెట్ లో ఎవరికి ఏ శాఖ ఇస్తారనే ఉత్కంఠ కొనసాగింది. చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు తరువాత మంత్రులకు శాఖలు ఖరారు చేసారు. జనసేన నుంచి ముగ్గురు మంత్రులకు శాఖలు కేటాయించారు. పవన్ కల్యాణ్ కు కీలకమైన బాధ్యతలు అప్పగించారు. పవన్ కు హోం శాఖ ఇస్తారని చాలా కాలం ప్రచారం సాగింది. అయితే, పవన్ కు తనకు హోం శాఖ కంటే తనకు ఇష్టమైన గ్రామీణ, పర్యావరణ ఇవ్వాలని కోరారు. దీంతో..పవన్ కోరుకున్న విధంగా శాఖలను కేటాయిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

పవన్ కు కీలక బాధ్యతలు
జనసేనాని పవన్ కు ఏపీ మంత్రివర్గలో కీలకమైన పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ -పర్యావరణ శాఖలు కేటాయిస్తూ చంద్రబాబు నిర్ణయించారు. అదే విధంగా పవన్ తో చర్చల తరువాత జనసేన నుంచి మంత్రులుగా ఉన్న మరో ఇద్దరి శాఖలను నిర్ణయించారు. నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాల శాఖ కేటాయించారు. మరో మంత్రి కందుల దుర్గేష్ కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను ఖరారు చేసినట్లు సమాచారం.పవన్ కోరిన మేరకే గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖను కేటాయించినట్లు తెలుస్తోంది. లోకేష్ కు కీలక శాఖలను కేటాయించనున్నట్లు సమాచారం. ఐటీతో పాటుగా ఉపాధి కల్పన బాధ్యతలను లోకేష్ కు అప్పగిస్తారని చెబుతున్నారు.

ఎవరికి ఏ శాఖ
అమరావతి నిర్మాణంతో ముడిపడి ఉన్న పట్టణాభివృద్ధి శాఖను పి నారాయణకు కేటయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆర్దిక శాఖను ఆనం రామనారాయణ రెడ్డి.. ఇరిగేషన్ శాఖను పయ్యావుల కేశవ్ కు అప్పగిస్తారని పార్టీ ముఖ్యుల సమాచారం. అచ్చెన్నాయుడు లేదా రామానాయుడులో ఒకరికి వ్యవసాయ శాఖ దక్కే అవకాశం ఉంది. బీజేపీ మంత్రి సత్యకుమార్ కు దేవాదాయ శాఖ ఇస్తారని తెలుస్తోంది. సంధ్యారాణికి గిరిజన సంక్షేమం, ఫరూక్ కు మైనార్టీ సంక్షేమం, కొల్లు రవీంద్రకు బీసీ సంక్షేమం, పార్ధసారధికి విద్యాశాఖ, వంగలపూడి అనిత సాంఘిక సంక్షేమ శాఖలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రం సచివాయలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు చేపట్టనున్నారు. అనంతరం అయిదు హామీల పైన సంతకాలు చేయనున్నారు.
-
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి!











Click it and Unblock the Notifications