పీఆర్సీ పై చంద్రబాబు కీలక ప్రకటన - బకాయిలు,పెండింగ్ డీఏల నిధుల జమ ఇలా..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. ఉద్యోగులతో జరిగిన చర్చల వేళ రిలీఫ్ ఇచ్చే నిర్ణయాలు తీసుకున్నారు. వారి సమస్యల పైన ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టం చేసారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం...వారికి సాధ్యమైనంత సాయంగా నిలుస్తామని సీఎం హామీ ఇచ్చారు. పీఆర్సీతో పాటుగా పెండింగ్ డీఏల చెల్లింపు పైనా నిర్ణయం ప్రకటించారు. వీటి అమలు విధి విధానాల పైనా స్పష్టత ఇచ్చారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగుల సమస్యల పైన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న విధంగా 12వ PRC నియామకానికి అంగీకారం తెలిపారు. అదే విధంగా పెండింగ్ లో ఉన్న రెండు డీఏలను వచ్చే నెల అక్టోబర్ 1వ తేదీ నుంచి చెల్లింపుకు అంగీకారం కుదిరింది. 1-7-2024, 1-1-2025 డీఏలు విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా 2022 సంవత్సరానికి సంబంధించి సరెండర్ లీవ్స్ వచ్చే సంక్రాంతికి అకౌంట్ లో వేయడానికి అంగీకరించారు.

ఇక.. పోలీసులకు 1 అడిషనల్ సరెండర్ లీవ్ ఈ దసరాకి చెల్లింపు చేస్తామని హామీ ఇచ్చారు. అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ జనవరి- 2027 నుంచి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. 70 ఏళ్లు దాటిన వారికి 10 శాతం, 75 ఏళ్లు దాటిని వారికి 15 శాతం మేర అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ వర్తింపు పైనా నిర్ణయం జరిగింది.
కాగా, ఎంప్లాయిస్ హెల్త్ స్కీంను స్ట్రీమ్ లైన్. వచ్చే నెల నుంచే ఏ నెలకు ఆ నెల ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కు చెల్లింపునకు చంద్రబాబు అంగీకరించారు. ఈ నిర్ణయాల కారణంగా ప్రతి ఏడాది రూ.2880 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసారు. చంద్రబాబుతో జరిగిన చర్చలు.. నిర్ణయా ల పైన ఉద్యోగ సంఘాల నేతలు సానుకూలంగా స్పందించారు.

త్వరగా పీఆర్సీ కమిషన్ నియామకం.. నివేదిక వస్తుందని అంచనా వేస్తున్నామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్దిక సమస్యలను అర్దం చేసుకుంటామని.. ప్రభుత్వానికి సహకారం అందిస్తామని వెల్లడించారు. రెండు డీఏల చెల్లింపుతో పాటుగా పెండింగ్ బకాయిల చెల్లింపు విషయంలో స్పష్టత ఇచ్చారని.. హామీలు పూర్తి స్థాయిలో అమలు అవుతాయని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పుకొచ్చారు.














Click it and Unblock the Notifications