అలా చేస్తే వాళ్లకు మనకు తేడా ఏంటి - చంద్రబాబు సీరియస్..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు తన పార్టీ నేతలకు కీలక దిశా నిర్దేశం చేసారు. అధికారంలోకి వచ్చేశాం అనే అలసత్వం నేతలు వీడాలన్నారు. సమర్థులందరికీ నామినేటెడ్ పదవులు దక్కుతాయని హామీ ఇచ్చారు. మంత్రుల్ని పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చే బాధ్యత జోనల్ ఇన్‌చార్జ్‌లు తీసుకోవాలని సీఎం తెలిపారు. పార్టీ నేతలు ఎవ్వరూ వ్యక్తిగత దాడులకు, కక్షసాధింపులకు దిగొద్దని స్పష్టం చేశారు. మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేసారు.

పార్టీ నేతలకు సూచనలు
పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబుసమావేశమయ్యారు. అధికారంలోకి వచ్చేశాం అనే అలసత్వం నేతలు వీడాలన్నారు. మంత్రులు కూడా పార్టీ కార్యాలయానికి తరచూ రావటం సేవగా భావించాలని తెలిపారు. ప్రతీ రోజూ ఇద్దరు మంత్రులైనా పార్టీ కార్యాలయానికి వచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రజలు, కార్యకర్తల నుంచి వచ్చే వినతుల్ని స్వీకరించి వాటి పరిష్కరించేందుకు మంత్రులంతా బాధ్యత తీసుకోవాలని సూచించారు. కార్యకర్తలు, ప్రజల నుంచి వినతులు, విజ్ఞాపనలు స్వీకరణకు ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు.

CM chandra Babu clarifies over nominated posts and pending cases on cadre

దాడులకు దిగొద్దు
ఇందుకోసం ఓ ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. పార్టీ నేతలు ఎవ్వరూ వ్యక్తిగత దాడులకు, కక్షసాధింపులకు దిగొద్దని స్పష్టం చేశారు. వైసీపీ చేసిన తప్పులే మనం చేస్తే... వారికీ మనకూ తేడా ఉండదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తప్పు చేసిన వారిని చట్టపరంగానే శిక్షిద్దామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. గత 5 ఏళ్లుగా పార్టీ కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసులపై ఈ సందర్భంగా సీఎం ఆరా తీశారు. చట్టపరంగానే వారికి కేసుల నుంచి ఎలా విముక్తి కలిగించాలనే దానిపై ముఖ్యమంత్రి చర్చించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు తమ పరిధిలో నమోదైన అక్రమ కేసుల వివరాలను పంపాలని ఆదేశించారు.

CM chandra Babu clarifies over nominated posts and pending cases on cadre

వారికే పదవులు
తెలుగుదేశం నేతలు, ఇళ్లు, కార్యాలయాలపై గతంలో వైసీపీ మూకలు దాడులకు దిగినప్పుడు కేసులు పెట్టినా సక్రమంగా వ్యవహరించని విచారణ అధికారుల వివరాలు ఇవ్వాలన్నారు. చట్టపరంగానే వారి సంగతి తేలుద్దామని తెలిపారు. సమర్థులందరికీ నామినేటెడ్ పదవులు దక్కుతాయని హామీ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడిన వారి గురించి ఐదు విధాలుగా సమాచార సేకరణ చేస్తున్నామన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, జిల్లా అధ్యక్షులతో, పార్లమెంట్ కోఆర్టినేటర్, నియోజకవర్గ పరిశీలకుడితో పాటు ఐవీఆర్ఎస్ ద్వారానూ సమాచార సేకరణ చేస్తున్నామన్నానరు. నివేదికలు త్వరగా పంపాలని ఆదేశించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+