ఢిల్లీకి చంద్రబాబు - ఆ వేళ మద్దతుగా నిలిచిన మన్మోహన్..!!
మాజీ ప్రధాని మన్మోహన్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ప్రధాని మోదీ, అమిత్ షా ఢిల్లీలో మన్మోహన్ భౌతిక కాయం సందర్శించి నివాళి అర్పించారు. మన్మోహన్ కు నివాళి అర్పించేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తున్నారు. రేపు (శనివారం) ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇదే సమయంలో మన్మోహన్ తో చంద్రబాబుకు ఉన్న అనుబంధం టీడీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ కు నివాళి అర్పించనున్నారు. భారత మాజీ ప్రధాని, పేరెన్నికగన్న ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ఇక లేరని తెలిసి తీవ్ర విచారానికి గురయ్యానని చంద్రబాబు తెలిపారు. మేధావి, రాజనీతిజ్ఞుడు అయిన మన్మోహన్ సింగ్ వినయానికి, విజ్ఞానానికి, సమగ్రతకు ప్రతిరూపం అని అభివర్ణించారు. మన్మోహన్ తో తన అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

1991లో ఆర్థికమంత్రిగా ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చినప్పటి నుంచి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించే వరకు దేశానికి అవిశ్రాంతంగా సేవలు అందించారని కొనియాడారు. ఆయ న మృతి దేశానికి తీరనిలోటు అని పేర్కొన్నారు. 2019 ఎన్నికల ముందు ఏపీ సీఎంగా నాడు చంద్రబాబు ఢిల్లీలో ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ధర్మ పోరాట దీక్ష చేసారు. ఢిల్లీ వేదికగా చంద్రబాబు చేసిన ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా నాడు ప్రధాని హోదాలో ఉన్న మన్మోహన్ హాజరయ్యారు. చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు.
రాష్ట్ర విభజన సమయంలోనూ నాడు చోటు చేసుకున్న పరిణామాల పై విపక్ష నేతగా చంద్రబాబు నాటి ప్రధాని మన్మోహన్ కు పలు అంశాల పైన లేఖలు రాసారు. మన్మోహన్ ఆర్దిక సంస్కరణల గురించి చంద్రబాబు పలు సందర్భాల్లో గుర్తు చేసారు. మన్మోహన్ మరణం పట్ల ఏపీకి చెందిన పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications