కొత్త ఇళ్ల పై ప్రభుత్వం గుడ్ న్యూస్- అర్హుల జాబితా సిద్దం, పంపిణీ ముహూర్తం..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలందరికీ ఇళ్ల పంపిణీ పై కార్యాచరణ సిద్దం అయింది. స్పష్టమైన కాల పరిమితిని సీఎం చంద్రబాబు ఖరారు చేసారు. అర్హుల జాబితాల పైన కసరత్తు జరుగుతోంది. ప్రతీ మూడు నెలలకోసారి సామూ హిక గృహప్రవేశాలు చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వచ్చే ఉగాదికి 5 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అప్పగించాలని లక్ష్యంగా నిర్ణయించారు.
పేదలకు ఇళ్ల పంపిణీ పైన సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. వచ్చే మూడేళ్లల్లో 17 లక్షల ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. ఇళ్ల లబ్ధిదారుల సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని తేల్చిచెప్పారు. ఇప్పటి నుంచే లక్ష్యాలు పెట్టుకుని హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని 2029 జనవరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం గుర్తించిన లబ్ధిదారులే కాకుండా ఇంకా అర్హులైన వారిని గుర్తించి చేర్చేందుకు చేస్తున్న సర్వేను త్వరగా పూర్తి చేసి జాబితా సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఆ జాబితాను గ్రామాల వారీగా ప్రదర్శించాలని చెప్పారు. ప్రజలు తృప్తి చెందితేనే తనకు సంతృప్తి అని వెల్లడించారు.

గృహ నిర్మాణాల్లో భాగంగా ఎవరైనా స్థలం కావాలని అడిగితే స్థలం ఇవ్వాలని, తమకు స్థలాలు ఉన్నాయని లబ్ధిదారులు చెబితే వాళ్లకు పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలన్నారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రతి పురోగతి ఆన్‌లైన్‌లో ఉండేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి కుటుం బాలను ప్రొత్సహించే విధంగా ఇళ్ల నిర్మాణాలను చేపట్టేలా చూడాలన్నారు. పీఎంఏవై 1.0 హౌసింగ్ స్కీములోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీవీటీజీ వంటి సామాజిక వర్గాలకు అదనంగా చెల్లింపులు జరుపుతున్నామన్న సీఎం ముస్లింలకూ అదనంగా రూ.50 వేలు చెల్లిస్తామన్నారు. దీనికి 18 వేల లబ్ధిదారులకు రూ.90 కోట్లు అవసరమవుతాయన్నారు. ఇక, ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ స్కీంకు సంబంధించిన కొందరు లబ్ధిదారులకు పెండింగులో ఉన్న రూ.920 కోట్ల మేర బిల్లులను రప్పించేలా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications