Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జమిలి వేళ చంద్రబాబు కీలక నిర్ణయం..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలకు కీలక దిశా నిర్దేశం చేసారు. పొత్తుల కొనసాగింపు పైన ఆసక్తి కరంగా స్పందించారు. కేంద్రంలో జమిలి ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్న వేళ సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ భారీ మెజార్టీ రావాలని సూచిస్తూనే.. వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీల పొత్తు కొనసాగాలని సూచించారు. ఇందు కోసం మూడు పార్టీల సమన్వయం కోసం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.

కూటమిగానే ముందుకు
ఏపీలో మూడు పార్టీల కూటమి గెలుపు శాశ్వతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలకు నిర్దేశించారు. 2029 ఎన్నికల్లోనూ ఏపీలో ఎన్డీఏ గెలుపు కోసం ఇప్పటికే పని చేయాలని సూచించారు. త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పైన కేడర్ ను అప్రమత్తం చేసారు.ప్రతి పట్టభద్రుడూ ఓటు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం కష్టపడి పని చేస్తున్న అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇప్పటికే రెండు నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఖరారు చేయటంతో వారి గెలుపు కోసం మూడు పార్టీలు కలిసి కట్టుగా పని చేయాలని చంద్రబాబు నిర్దేశించారు.

CM Chandra Babu fixed road map for party leaders over co ordination with alliance parties

కీలక ప్రతిపాదన
ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న ఉమ్మడి తూర్పు గోదావరి-పశ్చిమ గోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్డీయే అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జనసేన, బీజేపీలతో సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. తూర్పుగోదావరి - పశ్చిమ గోదావరి పట్టభద్రుల ఎన్నికల అభ్యర్ధిగా పేరాబత్తుల రాజశేఖర్, గుంటూరు - కృష్ణా జిల్లాల అభ్యర్ధిగా ఆలపాటి రాజేంద్రప్రసాద ను ఎన్డీయే తరఫున ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసారు. ప్రతి నియోజకవర్గంలో మూడు పార్టీల నేతలతో కో ఆర్డినేషన్ మీటింగ్​లు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. మూడు పార్టీలు కలిసి పని చేయడం వల్ల మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో 93 శాతం సీట్లు సాధించామని స్పష్టం చేశారు.

కలిసి కట్టుగా
ఇదే సమయంలో మూడు పార్టీల మధ్య సమన్వయం కోసం మండల స్థాయిలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఏపీ బ్రాండ్​ పునరుద్ధరించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నామని చెప్పారు. దేశం, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పని చేయాలని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ మూడు పార్టీల పొత్తు కొనసాగాలని .. తిరిగి విజయం దక్కేలా పార్టీ శ్రేణులు మిత్రపక్షాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని చంద్రబాబు పార్టీ నేతలకు నిర్దేశించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+