పెన్షన్ల పై చంద్రబాబు తాజా నిర్ణయం- నో కాంప్రమైజ్..!!
సామాజిక పెన్షన్ల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం కొత్త రికార్డు సాధించింది. అధికారంలోకి వస్తే పెన్షన్ నాలుగు వేలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత తొలి సంతకం పెన్షన్ల పంపిణీ పైనే చేసారు. హామీ ఇచ్చిన విధంగా మూడు నెలల బకాయిలు కలిపి.. అధికారంలోకి వచ్చిన మొదటి నెలే రూ 7 వేలు పంపిణీ చేసారు. ఇప్పుడు ప్రతీ నెలా నాలుగు వేలు అందిస్తున్నారు. దాదాపుగా రూ 2, 700 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇదే సమయంలో కొత్త పెన్షన్ల పైన చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఒకటో తేదీనే
తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమానికి చిరునామాగా టీడీపీ నిలిచింది. ఏపీలో 2014 లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రూ 2 వేలు పెన్షన్ అందించింది. గత ప్రభుత్వం ఏడాదికి రూ 250 చొప్పున పెన్షన్ పెంచింది. కానీ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ విధంగా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఒకే సారి వెయ్యి రూపాయాలు పెంచి ప్రతీ నెలా రూ 4 వేల చొప్పున పెన్షన్ అందిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 64,61,485 పెన్షన్లు ఉన్నాయి. వాటి కోసం ప్రభుత్వం ప్రతి నెల రూ.2,729.87 కోట్లు ఖర్చు చేస్తుంది.

దేశంలోనే రికార్డు
ప్రతీ నెలా ఒకటో తేదీనే సచివాలయ సిబ్బంది తో పెన్షన్లను ఇంటి వద్దనే అందిస్తున్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి స్వయంగా ప్రతీ నెలా ఒక్కో జిల్లాలో పర్యటించి లబ్దిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వటంతో పాటుగా వారి కష్ట సుఖాల పైన ఆరా తీస్తున్నారు. ఏపీలో చంద్రబాబు అమలు చేస్తున్న విధంగా పెన్షన్లు దేశంలో ఏ ఇతర రాష్ట్రంలోనూ లేదు. ఎక్కడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ ఇంత భారీ సంఖ్యలో లబ్దిదారులకు ఒకే సమయంలో అందటం లేదు. దీంతో, ఈ రికార్డు చంద్రబాబు ప్రభుత్వం సొంతం చేసుకుంది. ఒక వేళ ఒకటో తేదీ సెలవు అయితే, ముందు రోజునే లబ్దిదారులకు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ.. నిబద్ధతతో పెన్షన్లు పంపిణీ చేయటం ద్వారా దాదాపు 65 లక్షల కుటుంబాల్లో సంతోషం కనిపిస్తోంది.
చంద్రబాబు నిర్ణయంతో
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్ తో పాటుగా వితంతువు, ఒంటరి మహిళా, వికలాంగుల, డప్పు కళాకారుల, చర్మ కళాకారుల, కల్లు గీత కార్మికులకు పెన్షన్లు అందిస్తోంది. దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు ప్రభుత్వం నుంచి పెన్షన్ అందుతోంది. ఈ కేటగిరీల్లో అర్హత ఉండీ పెన్షన్ అందని వారి కోసం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ కాలంలో పెన్షన్ కోసం దరఖాస్తు చేసి నిరీక్షించినా ఫలితం అందని వారికి చంద్రబాబు ప్రభుత్వం అండగా నిలవాలని నిర్ణయించింది. ఇందు కోసం కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. జనవరిలో అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో, ఏపీలో మాత్రమే ఈ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఒకటో తేదీనే పెన్షన్ లబ్ది దారులకు అందుతోంది. పెన్షన్ల అంశం చంద్రబాబు వ్యక్తిగత ప్రతిష్ఠగా తీసుకొని లబ్దిదారులకు అండగా నిలుస్తున్నారు.
-
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్"












Click it and Unblock the Notifications