పార్టీలోకి కోవర్టులను పంపుతున్నారు - చంద్రబాబు హెచ్చరిక..!!
మహానాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. రాబోయే కాలంలో తెలుగుజాతి ప్రపంచంలో నంబర్ వన్‌గా ఉంటుందని చెబుతున్నాను.. ఇది సీబీఎన్ కోట్ అని పేర్కొన్నారు. రాబోయే 47 సంవత్సరాలకు ఒక రోడ్ మ్యాప్‌ను రూపకల్పన చేశామన్నారు. పార్టీ లోకి వలస పక్షులు వస్తాయ్..పోతాయ్ అని వ్యాఖ్యానించిన చంద్రబాబు.. నిజమైన కార్యకర్త పార్టీ లోనే ఉంటారని చెప్పుకొచ్చారు. పార్టీలో కోవర్టులుగా ఉంటూ అజెండా అమలు చేయాలనుకుంటే కుదరదని చంద్రబాబు తేల్చి చెప్పారు.
కోవర్టులతో జాగ్రత్త
కడపలో టీడీపీ మహానాడు కొనసాగుతోంది. చంద్రబాబు కీలక ప్రసంగం చేసారు. ఎన్టీఆర్ సంక్షేమ ఆరాధ్యుడని.. తెలుగు చరిత్ర ఉన్నంత వరకు ఎన్టీఆర్ నిలిచిపోతారని కీర్తించారు. కోవర్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు హెచ్చరించారు. నేరస్థులు చేసే మాయా కనికట్టు పై అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై అసభ్య ప్రచారం చేస్తే సహించమని స్పష్టం చేసారు. గుండెపోటుతో వివేకా మరణించారంటే అందరితో పాటుగా తాను నమ్మానని చెప్పుకొచ్చారు. తన లాంటి నాయకుడినే మోసం చేయగలిగారని పేర్కొన్నారు. ఈ నెపం తన పై వేసేందుకు దుష్ప్రచారం చేసారన్నారు.

వారిని ఉపేక్షించం
ఆరు శాసనాలు ద్వారా పార్టీ భవిష్యత్తు మారుతుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ ఆరు శాసనాల ద్వారా 2047 నాటికి తెలుగు జాతి విశ్వఖ్యాతి సాధిస్తుందనే నమ్మకం తనకుందన్నారు. ఎప్పటికప్పుడు నూతన నాయకత్వాన్ని కూడా తీసుకొస్తున్నామని చెప్పారు. మళ్ళీ జన్మ అంటూ ఉంటే తెలుగువాడి గానే పుట్టాలని కోరుకుంటున్నానని సీఎం వెల్లడించారు. కార్యకర్తే అధినేత అని.. వారే తనకు హైకమాండ్ అని చెప్పుకొచ్చారు. లోకేష్‌కు ఉండే నాలెడ్జ్ ఆధారంగా ఆరు శాసనాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటామన్నారు. 43 ఏళ్ళుగా టీడీపీ జెండా రెప రెప లాడుతోందంటే అది కార్యకర్తల త్యాగం అని చెప్పుకొచ్చారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా టీడీపీ గెలవాలని చంద్రబాబు నిర్దేశించారు.
పథకాల అమలు
ప్రజలకు అండగా ఉండాలని... వారి కోసం పని చేయాలని కార్యకర్తలకు చంద్రబాబు స్పష్టం చేసారు. అప్పుడే పార్టీకి ఆదరణ ఉంటుందని వెల్లడించారు. పల్నాడులో హత్యలు చేస్తున్నారని.. కొంతమంది టీడీపీలో చేరి కోవర్టులుగా మారి వాళ్ల టార్గెట్‌లను హత్య చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కోవర్ట్‌ల ద్వారా వారి అజెండాను అమలు చేయాలంటే కుదరదని స్పష్టం చేశారు. వలస పక్షులు వచ్చి వెళుతూ ఉంటాయని... కానీ కార్యకర్తలు శాశ్వతంగా ఉంటారని అన్నారు. సామాజిక న్యాయం గురించి చాలామంది మాట్లాడారని.. కానీ సామాజిక న్యాయాన్ని టీడీపీ అమలు చేసి చూపించిందన్నారు. తల్లికి వందనం ఈనెల లేదా వచ్చే నెల ఇచ్చేస్తామని తెలిపారు. ఆగ స్టు 15 నుంచి మహిళకు ఆర్టీసీ బస్‌లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని ప్రకటించారు . ఆరు సూత్రాలు గేమ్ చేంజర్‌గా ఉపయోగపడతాయన్నారు. పార్టీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెప్పారు. ఈ ఆరు శాసనాలను చివరి వరకు తీసుకువెళ్ళాలని కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications