175 నియోజకవర్గాల్లోనూ, ఇక నుంచి - టార్గెట్ ఫిక్స్ చేసిన చంద్రబాబు..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక దిశా నిర్దేశం చేసారు. విశాఖలో గూగుల్ తో పాటు ఇతర సంస్థలు కూడా డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాల ను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. జగన్ తాడేపల్లిలో తన ఇంటి వద్ద హెలిపాడ్ కోసం స్థలం బలవంతంగా తీసుకున్నారని చెప్పుకొచ్చారు. ప్రతీ నియోజకవర్గం కేంద్రంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు వివరించారు.
సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులతో సమావేశం జరుగుతోంది. రియల్ టైమ్ గవర్నెన్సులో భాగంగా అవేర్, డేటా లేక్ సహా పాలనలో ఏఐ టూల్స్ ఇతర సాంకేతికత వినియోగంపై అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేసారు. మూడు నెలలకూ రి కలెక్టర్ల కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నామని, ప్రతినెలా రెండుసార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సీఎం తెలిపారు. జగన్ ఇంటి దగ్గర ఉన్న హెలిప్యాడ్ భూమి పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ ఇంటి పక్కన ఉన్న హెలిప్యాడ్ కోసం భూమిని బలవంతంగా లాక్కున్నారని.. ప్రైవేటు వ్యక్తికి దగ్గర కొనుక్కున్న భూమిని హెలిప్యాడ్ కోసం ఇవ్వనంటే.. బెదిరించారని చెప్పుకొచ్చారు. అయినా ఇవ్వకపోతే.. 22-A లో పెట్టారని చెప్పారు. చట్టాలు చేయాల్సిన ముఖ్యమంత్రి, చట్టాలను అమలు చేయాల్సిన వ్యక్తి ప్రైవేట్ వ్యక్తి భూమీని ఇల్లీగల్ గా 22-A లో పెట్టారని వ్యాఖ్యానించారు.

అధికారులకు దిశా నిర్దేశం
రెవెన్యూ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని చంద్రబాబు చెప్పారు. 204 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి అన్నార్తుల ఆకలి తీరుస్తున్నామని వివరించారు. పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను గత ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ద్వారా డ్రైవర్లకు మేలు చేస్తున్నామని పేర్కొన్నారు. రూ.1100 కోట్లు మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా పంటలను ఆదుకుంటున్నామని.. ధాన్యం కొనుగోళ్లకు కూడా రూ.10 వేల కోట్ల మేర 48 గంటల్లోనే చెల్లింపులు చేశామని చెప్పారు. జముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రాష్ట్రవ్యాప్తంగా ఇస్తున్నట్లు వివరించారు. సాగునీటి కోసం ఇప్పటి వరకూ రూ. 24 వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు.
క్వాంటం వ్యాలీకి ఇటీవలే శంకుస్థాపన చేసి అమరావతిని క్వాంటం కంప్యూటింగ్ కేంద్రంగా మారుస్తున్నామని వివరించారు. విశాఖలో గూగుల్ తో పాటు ఇతర సంస్థలు కూడా డేటా సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు. విద్యుత్ రంగంలో ట్రూ అప్ నుంచి ట్రూడౌన్ చేసే పరిస్థితికి వచ్చామన్నారు.రూ. 1000 కోట్లతో రోడ్ల మరమ్మత్తు చేశాం, మరో రూ. 3 వేల కోట్లు ఖర్చు చేసి రోడ్లను నిర్మిస్తున్నామని వివరించారు. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు పెడుతున్నామని ప్రకటించారు. రూ.20 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 23 లక్షల మందికి ఉద్యోగాలు రానున్నట్లు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టును 2027 పుష్కరాల నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు.
-
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు










Click it and Unblock the Notifications