అమరావతి రైతులకు పండుగే, చంద్రబాబు అనూహ్య నిర్ణయం..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధానికి మూడు నెలల కాలంలో ఒక రూపు రావాలని నిర్దేశించారు. అమరావతిలో 212 కోట్ల వ్యయంతో రాజ్ భవన్ నిర్మాణం పైనా నిర్ణయం తీసుకున్నారు. సెక్రటేరీయేట్ టవర్లతో సహా ఇతర నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇదే సమయంలో రైతులు ఎంతో కాలంగా వేచి చూస్తున్న రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు పైన చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
రాజధాని అమరావతి పనుల పైన సీఎం చంద్రబాబు సమీక్ష చేసారు. ఇదే సమయంలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు సంబంధించిన అంశాల పైన స్పష్టత ఇచ్చారు. అమరావతి అభివృద్ధితో పాటు రాజధానికి భూములిచ్చిన రైతులు కూడా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను తక్షణం ఇవ్వాలని ఆదేశించారు.సీఆర్డీఏ అథార్టీ సమావేశంలో చంద్రబాబు పలు నిర్ణయాలు తీసుకున్నారు.

రాజధాని నిర్మాణ పనులు రీ-స్టార్ట్ చేశామన్న సీఎం చంద్రబాబు, ఇందుకోసం భూములను త్యాగం చేసిన రైతులకే మొదటగా రాజధాని అభివృద్ధి ఫలాలు అందాలని స్పష్టం చేశారు. కౌలు చెల్లింపుల్లోనూ ఎలాంటి జాప్యం జరగకూడదని తేల్చిచెప్పారు. రైతులకు ఎక్కడ రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తామని చెప్పామో, అక్కడే ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు.
రైతులకు ఏ ఊళ్లో భూములిచ్చిన వారికి ఆ ఊళ్లోనే ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చినందున అందుకు తగ్గట్లుగా ఎలాట్మెంట్ చేయాలని అధికారులకు స్పష్టం చేసారు. రాజధాని నిర్మాణ పనుల్లో మరింత వేగం పెరగాలన్న సీఎం, సెక్రటేరీయేట్ టవర్లతో సహా ఇతర నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వెస్ట్ బైపాస్ రోడ్డును వెంటనే ప్రారంభించేలా కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకోవాలని చెప్పారు. కరకట్ట రోడ్డును విస్తరించాలన్న చంద్రబాబు, మూడు ఏళ్లలో రాజధాని నగరాన్ని ఓ రూపు తీసుకురావాలని సూచించారు. రాజ్ భవన్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్ అద్భుతంగా ఉండాలని సీఎం సూచించారు. కృష్ణా నదీ ఒడ్డున అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా రాజ్ భవన్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
కాగా, మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి 25 శాతం నిధులను సీఆర్డీఏ ఇచ్చేందుకు అథార్టీ ఆమోదం తెలిపింది. రాజధాని ప్రాంతంలో నాలుగు కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి అంగీకరించింది. రాజధాని నగర జోనింగ్ నిబంధనల్లో గ్రీన్ సర్టిఫైడ్ భవనాలు ఉండేలా అవసరమైన మార్పులు చేర్పులు ఆమోదం తెలిపింది. కొండవీడు వాగు సమీపంలో నీటి ప్రవాహాల కోసం 8400 క్యూసెక్కుల సామర్థ్యంతో మరో పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి అథార్టీ ఆమోద్రముద్ర వేసారు. అమరావతి క్యాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి ఎగ్జిక్యూటీవ్ ఏజెన్సీగా సీఆర్డీఏ వ్యవహరించేలా అథార్టీలో నిర్ణయం తీసుకున్నారు.
-
ఏపీలో మహిళలకు దక్కే నియోజకవర్గాలు ఫిక్స్, కీలక మంత్రుల స్థానాలు సైతం..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications