చంద్రబాబు రాజకీయ జీవితంలో కీలక అడుగు..!!
అమరావతిలో సొంతింటి నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రాజధాని లో సొంతింటి నిర్మాణ కోసం చంద్రబాబు గతంలోనే నిర్ణయం తీసుకున్నార. సచివాలయం వెనుక ఈ 9 రహదారి సమీపంలో ఇంటి స్థలం కొనుగోలు చేసారు. ఈ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. అయిదు ఎకరాల స్థలంలో ఇంటి నిర్మాణం కోసం నిర్ణయం తీసుకున్నారు. ప్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో 1,455 చదరపు గజాల విస్తీర్ణంలో జి ప్లస్ 1 ఇంటి నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన చేశారు.
కాంట్రాక్టు అప్పగింత
సంవత్సరంలోగా ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని చంద్రబాబు కాంట్రాక్టర్ కు సూచించారు. స్థలం కొనుగోలు సమయంలోనే వాస్తుకు అనుకూలత పరిశీలించారు. స్థలంలో నైరుతి మూలన శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఎక్కువ భాగం పచ్చదనం, మొక్కల కోసం కేటాయిం చారు. నిర్మాణ బాధ్యతను ఎస్‌ఆర్‌ఆర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి అప్పగించారు. తాత్కాలిక హైకోర్టు, సచివాలయం మధ్యన ఉన్న ఈ స్థలానికి నాలుగు వైపులా రోడ్లు ఉండటంతో దీనిని ఎంపిక చేసుకున్నారు. తూర్పున ఎన్10 రోడ్డు, ఉత్తరం వైపు ఈ6 రహదారులు ఉన్నాయి. పశ్చిమం, దక్షిణాన లేఅవుట్‌లోని అంతర్గత రోడ్లు వెళ్తాయి.

రైతుల పట్టు వస్త్రాలు
చంద్రబాబు ఇంటి శంకుస్థాపన కార్యక్రమం వేళ రాజధాని రైతులు అక్కడకు చేరుకున్నారు. అమరావతికి అనుకూలంగా నినాదాలు చేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి వెలగపూడి గ్రామస్థులు పట్టు వస్త్రాలు సమర్పించారు. నిర్మాణంలో భాగంగా ఈశాన్యంలో ఉండడంతో వాస్తు కోసం తీసుకున్నట్లు సమాచారం. దీన్ని సెక్యూరిటీ పోస్టు, సందర్శకుల వాహనాలు నిలిపేందుకు వినియోగించనున్నారు.












Click it and Unblock the Notifications