రూటు మార్చిన చంద్రబాబు, ఎమ్మెల్యేలకు బిగ్ టాస్క్ - గేమ్ ఛేంజర్..!!

ఏపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న కొత్త నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. వైసీపీని రాజకీయంగా దెబ్బ తీయటమే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఏడాది పాలన పూర్తయిన వేళ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు కూటమికి గేమ్ ఛేంజర్ గా మారుతున్నాయి. దీనిని గుర్తించిన చంద్రబాబు ఇప్పుడు ఎమ్మెల్యేలకు బిగ్ టాస్క్ అప్పగించారు. ఇదే వారి పని తీరుకు ప్రామాణికంగా మారనుంది. కూటమి భవిష్యత్ కు కీలకం కావటంతో పాటుగా ప్రస్తుత పరిస్థితుల్లో గేమ్ ఛేంజర్ గా నిలవనుంది.

చంద్రబాబు నిర్ణయంతో
ఏపీలో కూటమి పాలన ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సమయంలో చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం.. రాజకీయంగా కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. ఏడాది కాలం లో పలువురు ఎమ్మెల్యేల పని తీరు పైన ఫిర్యాదులు వస్తున్నాయి. అవినీతి పైన పెద్ద ఎత్తున ఆరో పణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు అవినీతికి పాల్పడే వారిని వదులుకోవటానికైనా సిద్దమని హెచ్చరించారు. ఇదే సమయంలో సంక్షేమ పథకాల అమలు ప్రారంభించారు. తల్లికి వందనం అమలు ఇప్పుడు రాజకీయంగా గేమ్ ఛేంజర్ గా మారుతోంది. హామీలు అమలు చేయ లేదనే ప్రతిపక్షాల విమర్శలకు సమాధానంగా మారింది. ఈ పథకం అమలు కూటమి నేతలకు భారీ ఊరటగా కనిపిస్తోంది.

CM Chandra Babu latest decision leads to new political turn for Govt

ఎమ్మెల్యేలకు టాస్క్
అదే విధంగా ఈ నెల 20న పీఎం కిసాన్ తో కలిపి అన్నదాత సుఖీభవ పథకం అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పథకంలో తొలి విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు. మూడు విడతలు ఈ పథకం అమలు చేయనున్నారు. ఆగస్టు 15 నుంచి మహిళల కు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం కానుంది. దీంతో, సూపర్ సిక్స్ లో నాలుగు ప్రధాన హామీల అమలు జరగనుంది. దీంతో.. ఇక, పాలనా పరంగా నిర్ణయాలు తీసుకుంటున్న చంద్రబాబు.. క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యేల పైన వస్తున్న ఫిర్యాదుల వేళ మరో నిర్ణయం అమలుకు సిద్దమయ్యారు. ఈ సమయంలో ప్రజలతో ఎమ్మెల్యేలు మమేకం అయ్యేలా మరో కార్యక్రమానికి రూపకల్పన చేసారు. అందులో భాగంగా ఈ నెల 23 నుంచి నెల రోజుల పాటు నాయకులు ఇంటింటికి వెళ్లాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు.

ఎమ్మెల్యేలకు ర్యాగింగ్స్
ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాల్ని వివరించాలని దిశానిర్దేశం చేశారు. లీడర్‌ నుంచి క్యాడర్ వరకు ఈ విజయయాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టా న బాధ్యత నేతలదేనని సీఎం స్పష్టంచేశారు. రోజూ పార్టీ కార్యక్రమాలకు కొంత సమయం కేటాయించాలని, ప్రజలతో కలుపుగోలుగా మెలగాలని ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు. దీని ద్వారా ఎమ్మెల్యేలకు ర్యాంకింగ్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో ప్రజల్లోనే ఎమ్మెల్యే లు ఉండటం.. ప్రభుత్వ పథకాలను వివరించటంతో పాటుగా.. ప్రతిపక్షం పైన ఒకే సమయంలో పార్టీ మొత్తం కౌంటర్ చేయటానికి వీలుగా రూపకల్పన చేసారు. దీంతో.. ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యేలు ఈ అవకాశం ఎంత వరకు సద్వినియోగం చేసుకుంటారనేది కీలకంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+