జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాసారు. మాజీ సీఎం జగన్.. పీసీసీ చీఫ్ షర్మిల తో పాటుగా డిప్యూటీ సీఎం పవన్.. అదే విధంగా అన్ని పార్టీల నేతలకు లేఖ ద్వారా కీలక విజ్ఞప్తి చేసారు. ఈ నెల 16వ తేదీ నుంచి కేంద్రం పార్లమెంట్ లో మహిళా బిల్లు ప్రవేశ పెట్టి.. ఆమోదించే ప్రయత్నం చేస్తున్న వేళ చంద్రబాబు ఈ లేఖ రాసారు. 2029 ఎన్నికల నుంచే మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు చేసేలా తీసుకువస్తున్న 'నారీ శక్తి వందన్' చట్ట సవరణ బిల్లుకు మద్దతు పలకాలని చంద్రబాబు కోరారు.

మహిళలకు పార్లమెంట్, విధాన సభల్లో మూడో వంతు రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పాన్ని బలపరుద్దామని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసారు. ఈ మేరకు అన్ని పార్టీలకు రాసిన లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు. ఈ నెల 16న పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లును ప్రవేశపెట్టడం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చారిత్రక మైలురాయిగా నిలిచిపోతుందని చంద్రబాబు తన లేఖలో అభిప్రాయపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై విస్తృతంగా చర్చలు జరిగాయి. త్వరితగతిన ఈ చారిత్రక చట్టం అమల్లోకి రావాలన్న ఏకాభిప్రా యం కూడా నాడు వ్యక్తమైంది. ఇందులో భాగంగా 2029లో జరిగే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్లు అమలు కావాలన్న ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆకాంక్షకు మనందరం మద్దతు పలుకుదామని ఆయన కోరారు. ఈ అంశం రాజకీయాలకు అతీతమైనదని, దేశ గౌరవానికి సంబంధించిన విషయమని చంద్రబాబు స్పష్టం చేశారు.

cm-chandra-babu-letter-to-ys-jagan-all-parties-leaders-asked-to-support-nari-shakti-vandan-bill-i

పార్లమెంట్ ప్రత్యేక సమావేశం.. బిల్లు ఆమోదం పై చర్చ

మహిళా రిజర్వేషన్ పై అంతా ఒకే స్వరం వినిపించాలని ఆడబిడ్డల తరుపున బాధ్యతతో ఈ లేఖ రాస్తున్నాను. మన ఇంటి ఆడబిడ్డలను, మన దేశ మహిళలను గౌరవించుకునే ఈ అవకాశాన్ని మనందరం అదృష్టంగా భావిద్దాం. ఈ పవిత్ర ఘట్టంలో భాగస్వామి అయ్యే సందర్భాన్ని ఎవరూ వదులుకోవద్దుఁ అని ఆయన హితవు పలికారు. ప్రతీ పార్టీ, ప్రతీ ఎంపీ ఈ చారిత్రాత్మక నిర్ణయంలో తమదైన ముద్ర వేయాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు. ప్రభుత్వంలో, పరిపాలనలో, చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యమవు తుందని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. భరతమాతను పూజించే మన దేశంలో, నారీ శక్తికి వందనం పలికే ఈ గొప్ప క్షణాలకు 140 కోట్ల మంది భారతీయులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ చారిత్రాత్మక విజయాన్ని చేకూర్చడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రధాని మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని సమష్టిగా బలపరచాలని చంద్రబాబు తన లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+