ముంబాయి- హైదరాబాద్, చెన్నై రైళ్లు రద్దు: విశాఖ వైపు దారి మళ్లింపు, లిస్టులో...!!
రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ముంబాయి రైల్వే డివిజన్ పరిధిలో భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడ్డాయి. దీంతో, రైళ్ల రాకపోకల పైన ప్రభావం పడింది. ఫలితం గా హైదరాబాద్ మీదుగా చెన్నై వైపు వెళ్లే పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసారు. హైదరాబాద్ వచ్చే రైళ్లను నిలుపుదల చేసారు. అదే విధంగా ముంబాయి నుంచి విశాఖతో సహా పలు ప్రాంతాల కు వెళ్లే రైళ్లను దారి మళ్లించారు. ఈ మేరకు పూర్తి వివరాలను రైల్వే అధికారులు వెల్లడించారు.
సెంట్రల్ రైల్వేలోని బొంబాయి డివిజన్‌లో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ కారణంగా హైదరాబాద్ మీదుగా ముంబై వెళ్లే 4 రైళ్లు రద్దు చేసినట్లు ప్రకటించిన రైల్వే.. మరో 10 రైళ్లను దారి మళ్లించినట్లు వెల్లడించింది. ఇప్పటికే బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించి తమ ప్రయాణాన్ని మార్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా...దారి మళ్లిన రైళ్లకు అనుగుణంగా బోర్డింగ్ మార్చుకోవాలని సూచిస్తున్నారు. ట్రైన్ నెంబర్ 22158 చెన్నై ఎగ్మోర్ - CST ముంబై ఎక్స్‌ప్రెస్ : జులై 25 నుంచి 28 వరకు రద్దయింది. నం. 22731 హైదరాబాద్ - CST ముంబై ఎక్స్‌ప్రెస్ : జులై 25 నుంచి 27 వరకు ఈ రైలు రద్దు కాగా, నం. 22157 CST ముంబై - చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ : జులై 25 నుంచి 28 వరకు రద్దయినట్లు అధికారులు ప్రకటించారు.

విశాఖ వైపు రైళ్ల దారి మళ్లింపు
కాగా.. నం. 22732 CST ముంబై - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ : జులై 25 నుంచి 28 వరకు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక.. రైలు నం. 18519 విశాఖపట్నం - LTT ముంబై ఎక్స్‌ప్రెస్ : జులై 26 వరకు దౌండ్ - మన్మాడ్ - ఇగత్‌పురి - కళ్యాణ్ స్టేషన్ల మీదుగా మళ్లించారు. దీంతో పాటుగా నం. 22102 మదురై - LTT ముంబై ఎక్స్‌ప్రెస్ ను జులై 24న దౌండ్ - మన్మాడ్ - ఇగత్‌పురి - కళ్యాణ్ స్టేషన్ల మీదుగా దారి మళ్లిస్తూ నిర్ణయించారు. నెం 11018 కరైకాల్ - LTT ముంబై ఎక్స్‌ప్రెస్ : జులై 27న దౌండ్ - మన్మాడ్ - ఇగత్‌పురి - కళ్యాణ్ స్టేషన్ల మీదుగా దారి మళ్లించినట్లు వెల్లడించారు. రైలు నం. 22718 సికింద్రాబాద్ - రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ : జులై 25, 27 తేదీల్లో దారి మళ్లించారు. దౌండ్ - మన్మాడ్ - జల్గావ్ - పాల్ధి - సూరత్ స్టేషన్ల మీదుగా కొనసాగనుంది. నం. 16614 కోయంబత్తూర్ - రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ : జులై 24న దౌండ్ - మన్మాడ్ - జల్గావ్ - పాల్ధి - సూరత్ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. ఇక.. నెంబర్ 18520 LTT ముంబై - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ : జులై 25 నుంచి 28 వరకు కళ్యాణ్ - ఇగత్‌పురి - మన్మాడ్ - దౌండ్ - సోలాపూర్ స్టేషన్ల మీదుగా నడుస్తుందని అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications