మోడీకి బీజేపీ అగ్రనేత ఝలక్..! కాక్రోచ్ లకు మద్దతుగా ట్వీట్..!

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్ధులు చేపట్టిన ఆందోళనలపై (CJP Protests) ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. విద్యార్ధుల ఆందోళనలకు మద్దతుగా పలువురు ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. విపక్షాలు కూడా విద్యార్ధులకు మద్దతుగా ప్రతీ చోటా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇదంతా సహజంగానే బీజేపీ (bjp)ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇలాంటి సమయంలో బీజేపీ అగ్రనేత ఒకరు కాక్రోచ్ లకు మద్దతుగా రంగంలోకి దిగారు.

బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన మురళీ మనోహర్ జోషీ (Murli Manohar Joshi) కాక్రోచ్ లకు మద్దతుగా గళం విప్పారు. అయితే ఎక్కడా కాక్రోచ్ జనతా పార్టీ పేరెత్తకుండానే విద్యార్దులపై ఢిల్లీ నిరసనల సందర్భంగా జరిగిన బలప్రయోగాన్ని తప్పుబడుతూ ట్వీట్ చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యువ విద్యార్థులు న్యూఢిల్లీ వీధుల్లో రోజుల తరబడి గుమిగూడి ఉండటం బాధాకరమని మురళీ మనోహర్ జోషి తెలిపారు. పరీక్షా విధానం పట్ల వారికి ఉన్న ఆందోళనలు వాస్తవమైనవని ఆయన తెలిపారు. వాటిని సానుభూతితో, శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలనే చిత్తశుద్ధితో పరిష్కరించాలన్నారు.

BJP Stalwart Murli Manohar Joshi Extends Support to Student Protesters in Delhi

దీనిని కేవలం బలప్రయోగంతో పరిష్కరించాల్సిన శాంతిభద్రతల సమస్యగా మాత్రమే పరిగణించరని తాను బలంగా ఆశిస్తున్నానని మురళీ మనోహర్ జోషి వెల్లడించారు. యువతుల పట్ల కూడా అత్యంత కఠినంగా, అమానుషంగా వ్యవహరించడం ఎంతో బాధాకరమని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రధాని మోడీకి భయపడి బీజేపీ మిత్రపక్షాలే విద్యార్ధుల ఆందోళనలకు కనీసం మద్దతు కూడా ప్రకటించకుండా దూరంగా ఉండిపోతున్న వేళ అదే బీజేపీలో అగ్రనేత అయిన మురళీ మనోహర్ జోషీ చేసిన ట్వీట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతే కాదు బీజేపీలోనూ గూడుకట్టుకున్న అసంతృప్తికి ఇది అద్దం పట్టేలా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+