కాక్రోచ్ ల దెబ్బకు కేంద్రం ఉక్కిరిబిక్కిరి..! ఢిల్లీ హైకోర్టులో కీలక పరిణామాలు..!

నీట్ సహా జాతీయ స్దాయి పోటీ పరీక్షల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నెల రోజులుగా ఢిల్లీలో ఆందోళనలు చేస్తోంది. జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు చేస్తున్న కాక్రోచ్ లను కానీ, నిరాహారదీక్షకు దిగిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ (Sonam Wangchuk)ను కానీ మొదట్లో పట్టించుకోని కేంద్రం.. ఆ తర్వాత పరిస్ధితి చేజారుతుండటంతో వారితో చర్చలు ప్రారంభించింది. అయినా వారి డిమాండ్లను అంగీకరించకుండా కాలయాపన చేయడంతో పాటు ఆంక్షలు, దాడులతో ఒత్తిడి పెంచుతోంది.

ఈ నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు, విద్యార్థులపై పోలీసుల దాడులు, ఆంక్షలు, ఇంటర్నెట్ నిషేధం, నిరంతర నిఘా, అదనపు బలగాల వాడకం ఇలా పలు అంశాలపై ఢిల్లీ హైకోర్టులో వరుస పిటిషన్లు దాఖలవుతున్నాయి. వీటిపై తొలుత ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ కూడా విచారణకు మొగ్గు చూపలేదు. కానీ ఆ తర్వాత పరిస్ధితి చేజారే ప్రమాదం ఉండటంతో ఢిల్లీ హైకోర్టు కూడా ఇప్పుడు ఘాటుగా స్పందిస్తోంది. దీంతో ఇప్పటికే కాక్రోచ్ ల తరఫున దాఖలైన పలు పిటిషన్లపై ఇవాళ విచారణ జరిపి తగు ఉత్తర్వులు ఇవ్వబోతోంది.

CJP Moves Delhi High Court Against Constant Surveillance Internet Restrictions at Jantar Mantar

జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదేశంలో నిరంతర నిఘా, ఇంటర్నెట్ ఆంక్షలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. నిన్న రాత్రి ప్రధాని మోదీ పరీక్షల విషయంలో కఠినమైన కొత్త చట్టం రాబోతోందని హామీ ఇస్తూ వీడియో సందేశాన్ని విడుదల చేసిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. పేపర్ లీక్‌ల వెనుక ఉన్నవారిని శిక్షించడానికి ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ప్రధానమంత్రి ఈ సందేశం ఇచ్చారు. అయితే ఇప్పటికే విద్యార్దులపై దాడులకు దిగిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియాల్లో ఉన్న పోలీసులపై వరుసగా సస్పెన్షన్లు, బదిలీలు, ఇతర బాధ్యతల అప్పగింతలు జరుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+