బెన్ స్టోక్స్ కు రీప్లేస్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్- నూతన కేప్టెన్ గా

ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ అనంతరం నూతన కేప్టెన్ అన్వేషణలో పడింది ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్. దాదాపు మూడు వారాల అనంతరం నూతన సారథిని ప్రకటించింది. అలాగే.. టెస్ట్ ఫార్మట్ హెడ్ కోచ్ ను కూడా దాదాపుగా ఖరారు చేసింది. న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ ఓడిన అనంతరం ఈ స్థానానికి బ్రెండన్ మెక్ కల్లమ్ రాజీనామా చేశారు. దీంతో కేప్టెన్, హెడ్ కోచ్ పదవులను భర్తీ చేయడానికి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ ప్రాధాన్యత ఇచ్చింది.

ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ పగ్గాలను స్టార్ బ్యాటర్ జో రూట్ చేపట్టనున్నాడు. న్యూజిలాండ్‌తో సిరీస్ ముగిసిన తర్వాత బెన్ స్టోక్స్ ఆకస్మికంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో అతని స్థానాన్ని జో రూట్ తో భర్తీ చేసింది. గతంలో కూడా జట్టును విజయవంతంగా నడిపించిన అనుభవం ఉండటం వల్ల మరోసారి జో రూట్‌ వైపే బోర్డు మొగ్గు చూపింది. వచ్చే నెలలో పాకిస్తాన్‌తో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కంటే ముందే ఈ తాజా మార్పులపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Joe Root set to be renamed England s Test captain following Ben Stokes retirement from cricket

2022లో జో రూట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. ఆ తర్వాత బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. అప్పట్లో హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌తో కలిసి స్టోక్స్ సృష్టించిన బజ్‌బాల్ వ్యూహం టెస్టు క్రికెట్ ఆడే విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో టెస్ట్ జట్టును మళ్లీ గాడిలో పెట్టేందుకు జో రూట్ సరైన ఎంపిక అని బోర్డు భావించింది.

పదేళ్ల జైలు, రూ. 10 కోట్ల జరిమానా: ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
పదేళ్ల జైలు, రూ. 10 కోట్ల జరిమానా: ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్

జో రూట్ కెప్టెన్‌గా రెండో ఇన్నింగ్స్ వచ్చే ఏడాది స్వదేశంలో జరగబోయే అత్యంత ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో పాకిస్తాన్, దక్షిణాఫ్రికా పర్యటనలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ అతని ప్రధాన సవాల్. ఈ నెండు సిరీస్ లల్లో నెగ్గితేగానీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు అర్హత సాధించలేదు ఇంగ్లాండ్. 2020లో జో రూట్ నాయకత్వంలోనే ఇంగ్లాండ్ జట్టు దక్షిణాఫ్రికా గడ్డపై 3-1తో అద్భుత సిరీస్ విజయాన్ని నమోదు చేసింది.

ఢిల్లీ ఆందోళనల తీవ్రత చార్మినార్ వద్ద ప్రతిధ్వనించింది.. !!
ఢిల్లీ ఆందోళనల తీవ్రత చార్మినార్ వద్ద ప్రతిధ్వనించింది.. !!

ఈ రెండింటి తర్వాత బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్తుంది ఇంగ్లాండ్. అనంతరం టెస్ట్ క్రికెట్ 150వ వార్షికోత్సవం సందర్భంగా మెల్‌బోర్న్ లో ఆస్ట్రేలియాతో జరిగే చారిత్రాత్మక డే-నైట్ టెస్టుకు కూడా రూట్ సారథ్యం వహించనున్నాడు. అదే సమయంలో ఇంగ్లాండ్ టెస్ట్ ఫార్మట్ హెడ్ కోచ్ గా బ్యాటింగ్ కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ అపాయింట్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు హెడ్ కోచ్ ఖరారు చేసే అవకాశం లేకపోవడం వల్ల మార్కస్ ట్రెస్కోథెక్ కే ఈ బాధ్యతను అప్పగిస్తారని తెలుస్తోంది.

ఇంగ్లాండ్ బోర్డు పూర్తిస్థాయి కోచ్ కోసమే ప్రయత్నిస్తున్నప్పటికీ అది అంత త్వరగా తేలట్లేదర. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లండన్ స్పిరిట్ వంటి ఫ్రాంచైజీలతో ఒప్పందాలు ఉండటం వల్ల మాజీ కోచ్ ఆండీ ఫ్లవర్ ఈ రేసు నుంచి తప్పుకొన్నారు. ఈ నేపథ్యంలో, అనుభవజ్ఞుడైన బ్యాటర్ జో రూట్, తాత్కాలిక కోచ్ ట్రెస్కోథిక్ వ్యూహాలతోనే ఇంగ్లాండ్ రాబోయే కీలకమైన సిరీస్‌లలో విజయాలను అందుకోవాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+