విద్యార్ధులకు సుప్రీంకోర్టు భారీ ఊరట...! ఎట్టకేలకు కీలక నిర్ణయం..!

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఇచ్చిన పిలుపు మేరకు కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు పలు కీలక డిమాండ్లతో ఢిల్లీ జంతర్ మంతర్ నుంచి చేపట్టిన పార్లమెంట్ మార్చ్ లో భారీ ఎత్తున విద్యార్ధులు పాల్గొన్నారు. అయితే వీరిని నియంత్రించేందుకు పోలీసులు బలప్రయోగంతో వీరిని అడ్డుకున్నారు. ఇందులో భాగంగా పలు చోట్ల లాఠీచార్జ్ లు చేయడం, భాష్పవాయువు ప్రయోగించడం, పెల్లెట్ల ప్రయోగం వంటి చర్యలకు దిగారు. వీటిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయితే వీటిపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు (Supreme Court) తాజాగా అంగీకరించకపోవడం వివాదాస్పదమైంది.

విద్యార్ధుల నిరసలపై ఉక్కుపాదం- వాట్సాప్ నోటీసులు, ఇళ్లలో తనిఖీలు..!
విద్యార్ధుల నిరసలపై ఉక్కుపాదం- వాట్సాప్ నోటీసులు, ఇళ్లలో తనిఖీలు..!

ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పరీక్షా పత్రాల లీకేజీకి నిరసనగా జంతర్ మంతర్ తో పాటు దేశవ్యాప్తంగా ఇతర ప్రదేశాలలో విద్యార్థి నిరసనకారులపై పోలీసులు మితిమీరి ప్రవర్తించారని ఆరోపిస్తూ దాఖలైన రెండు పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్లను సోమవారం విచారించాలని నిర్ణయించింది. మధ్యాహ్నం ఛీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. విద్యార్థి నిరసనకారులపై జరిగిన హింసకు సంబంధించి రెండు పిటిషన్లు ఇప్పుడు అధికారికంగా దాఖలయ్యాయని ఆయన సుప్రీంకోర్టుకు తెలిపారు.

Supreme Court to Hear Pleas Alleging Excessive Police Action Against Student Protesters on Monday
సోషల్ మీడియాలో ఆ వీడియోలు, పోస్టులపై సుప్రీంకోర్టు నిషేధం..!
సోషల్ మీడియాలో ఆ వీడియోలు, పోస్టులపై సుప్రీంకోర్టు నిషేధం..!

పోలీసులు పిల్లలపై మితిమీరిన బలప్రయోగం చేస్తున్నారని, ఇది నిరంతరాయంగా కొనసాగుతూనే ఉందని, కొన్ని నియంత్రణలు అవసరమని తెలిపారు. కోర్టు మనకు, పోలీసులకు మధ్య నిలుస్తుందన్నారు. ఈ సమర్పణను ప్రధాన న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు. ఈ పిటిషన్లను జాబితాలో చేర్చాలని, వాటిని విచారణకు స్వీకరిస్తామని తెలిపారు. దీంతో ఈ రెండు పిటిషన్లు సోమవారం విచారణకు వచ్చేందుకు మార్గం సుగమం అయింది.

విద్యార్ధులకు సంఘీభావంగా కాంగ్రెస్ కీలక పిలుపు-రేపు దేశవ్యాప్తంగా..!
విద్యార్ధులకు సంఘీభావంగా కాంగ్రెస్ కీలక పిలుపు-రేపు దేశవ్యాప్తంగా..!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+